పునీత్ రాజ్ కుమార్ మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు.  తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పునీత్ అకాల మరణం చెందాడని, తనకు రెండు రోజుల తర్వాత వార్త తెలిసిందని ఆయన తెలిపారు. పునీత్ తన కళ్ల ముందు పెరిగాడని అన్నారు. చిన్న వయసులో, స్టార్ హీరోగా ఎంతో మంది ప్రేమ, అభిమానాన్ని పునీత్ సొంతం చేసుకున్నారని, అతని మరణ వార్త తెలిశాక ఎంతో ఆవేదన చెందానని రజనీకాంత్ పేర్కొన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.





రజనీకాంత్ సంతాపం ప్రకటించడంలో ఏమీ తప్పు లేదు. కానీ, ఆయన సంతాపం ప్రకటించిన విధానం విమర్శల పాలైంది. గతంలో రజనీకాంత్ ఏదైనా విషయం చెప్పాలని అనుకున్నప్పుడు ట్వీట్ చేసేవారు. లేదంటే మీడియాకు ప్రెస్ రిలీజ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం ఆయన 'హూట్‌' యాప్ ఉపయోగిస్తున్నారు.  ఇది ఒక వాయిస్ర మెసేజ్ యాప్. రజనీకాంత్ కుమార్తె సౌందర్య ప్రారంభించారు.





పునీత్ మరణ వార్త తెలిసి చలించిన రజనీకాంత్ సంతాపం ప్రకటించినట్టు లేదని, సంతాపం పేరుతో తన కుమార్తె 'హూట్‌' యాప్ ను ప్రమోట్ చేస్తున్నారని రజనీపై నెటిజన్లు మండిపడుతున్నారు. రజనీకాంత్ పక్కా వ్యాపారిగా మారిపోయారని ఒకరు రిప్లై ఇస్తే... ఇంకొకరు కన్నింగ్ ఫెలో అని కామెంట్ చేశారు. ఇలా రజనీకాంత్ నెటిజన్స్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు.

Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
Also Read: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి