వరుస ఫ్లాపులతో కెరీర్ సందేహంలో పడిన సమయంలో వచ్చిన 'క్రాక్' సినిమా మాస్ మహారాజ్ రవితేజకి మంచి హిట్టించింది. రవితేజ ఈజ్ బ్యాక్ అనిపించింది.  ఈ ఏడాది ఆరంభంలో హిట్టు దక్కించుకున్నట్టే వచ్చే ఏడాది ఆరంభంలోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు రవితేజ. అందుకే తదుపరి మూవీ 'ఖిలాడీ'కి ముందే డేట్ ఫిక్స్ చేశారు. 2022 ఫిబ్రవరి  11న థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. ఈ డేట్ లాక్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. 






‘ఒక ఊరిలో’ సినిమాతో  కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పెన్మత్స  'రైడ్‌', 'అబ్బాయితో అమ్మాయి', 'వీర', 'రాక్షసుడు' సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘ఖిలాడి’. డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా 'ఖిలాడి' సినిమా ఉంటుందన్నారు రమేశ్ వర్మ.  ఈ సినిమాలో చూడబోయే రవితేజ పాత్ర ఇంతకు ముందు కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుందని స్పష్టం చేశారు.  ఈ మూవీలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమాను   డిసెంబర్ 24 న నాని 'శ్యామ్ సింగరాయ్'తో పోటీగా దించాలని మేకర్స్ భావించారు. కానీ ఏవో కారణాలతో 2022 ఫిబ్రవరికి డేట్ లాక్ చేశారు.  



క్రాక్ సినిమాలానే ఖిలాడీ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంటే మళ్లీ రవితేజ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చంటున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇంకా రవితేజ చేతుల్లో 'రామారావు ఆన్ డ్యూటీ', 'ధమాకా' అనే మరో రెండు సినిమాలున్నాయి. ఇవి పూర్తికాకుండానే కొత్తగా మరో సినిమా అనౌన్స్ చేశాడు రవితేజ. 'స్వామిరారా' సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన సుధీర్ వర్మ ఆ తరువాత 'కేశవ', 'రణరంగం' లాంటి సినిమాలు తీశాడు. ఇవి సరిగ్గా ఆడలేదు. దీంతో గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా ఓకే చేసుకున్నాడు. రవితేజ నటించే 70వ సినిమా ఇది. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరించనున్నారు.   
Also Read: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి