మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'భోళా శంకర్'. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ భాగస్వామ్యంతో అభిరుచి కల నిర్మాత అనిల్ సుంకరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ రోజు (గురువారం) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సినిమా ప్రారంభమైంది.
పూజా కార్యక్రమాల అనంతరం దేవుని చిత్రపటాలకు నమస్కరిస్తున్న మెగాస్టార్ చిరంజీవిపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఆయనతో సహా దర్శకులు వి.వి. వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, కె.ఎస్. రవీంద్ర (బాబీ), రచయిత సత్యానంద్... చిత్ర దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు.
'భోళా శంకర్' ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత ఏయం రత్నం, దర్శకులు ఎన్. శంకర్, వెంకీ కుడుముల, హాస్య నటుడు 'వెన్నెల' కిషోర్, చిత్ర సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ తదితరులు పాల్గొన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటించనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన తమన్నా భాటియా కథానాయికగా కనిపించనున్నారు.
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో తొలి సినిమా ఇది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ కు సైతం మెగాస్టార్ తో తొలి సినిమా ఇది. 'సైరా' తర్వాత మరోసారి చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా చిరంజీవికి కీర్తీ సురేష్ రాఖీ కడుతున్న ఫొటోలు విడుదల చేయగా... వాటికి మంచి స్పందన లభించింది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.
Also Read: 'నందమూరి నాయక.. ఏం ఎనర్జీ నాయక'..
Also Read: 'ఆర్ఆర్ఆర్' ఊరనాటు సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read:'ఊరనాటు' సాంగ్ పై సెలబ్రిటీల రియాక్షన్.. 'మెంటల్' అంటూ సమంత కామెంట్..
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి