ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో 'ఆహా' అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను మొదలుపెట్టారు. మొదట్లో కొన్ని ఒరిజినల్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఈ యాప్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో సమంత, రానా, మంచు లక్ష్మీ ఇలా పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి కొన్ని షోలను ప్లాన్ చేశారు. ఇవి కొంతవరకు కలిసొచ్చినా.. సబ్ స్క్రిప్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో అల్లు అరవింద్ తన మాస్టర్ బ్రెయిన్ తో బాలయ్యను రంగంలోకి దింపారు. 'Unstoppable' అనే షోని మొదలుపెట్టారు. 


 

ఇప్పుడు ఈ షో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది. దీపావళి కానుకగా తొలి ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. ఈ ఎపిసోడ్ కి మోహన్ బాబుని గెస్ట్ గా తీసుకురాగా.. మంచి వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు రెండో గెస్ట్ గా నేచురల్ స్టార్ నానిని తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో బయటకొచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా 'Unstoppable' స్టేజ్ పై బాలయ్య ఇచ్చిన పెర్ఫార్మన్స్ ను 'ఆహా' యూట్యూబ్ లో షేర్ చేసింది. 

 

నటి పూర్ణతో కలిసి బాలయ్య స్టెప్పులేశారు. బాలయ్య నటించిన 'సమరసింహా రెడ్డి' సినిమాలో 'నందమూరి నాయక' అనే పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇదే పాటకు ఎంతమాత్రం తన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా బాలయ్య పెర్ఫార్మ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. 'జై బాలయ్య..'.. 'బాలయ్య బాబు తోపు.. దమ్ముంటే ఆపు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలయ్య నటించిన 'అఖండ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.  


Also Read:'ఊరనాటు' సాంగ్ పై సెలబ్రిటీల రియాక్షన్.. 'మెంటల్' అంటూ సమంత కామెంట్..


Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..


Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీవిష్ణు


Also Read:  రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...


Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..


Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి