Arjuna Phalguna Teaser : అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీవిష్ణు

శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'అర్జున ఫాల్గుణ'. తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీవిష్ణు కనిపించనున్నారు. ఇంకా ఈ రోజు విడుదల చేసిన టీజర్‌ ఎలా ఉందంటే...

Continues below advertisement

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీవిష్ణు కనిపించనున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతోన్న సినిమా 'అర్జున ఫల్గుణ'. ఈ రోజు (మంగళవారం) టీజర్‌ విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ బర్త్‌డేకి శ్రీవిష్ణు కటౌట్స్‌ కట్టడమే కాదు, 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా విడుదల రోజున థియేటర్ల ముందు హంగామా చేశారు. కథలో ఎన్టీఆర్‌ అభిమాని అనే పాయింట్‌కి ఎంత ఇంపార్టెన్స్‌ ఉందో సినిమా విడుదలైతే తెలుస్తుంది. అయితే... టీజర్‌లో 'అరవింద సమేత...'లో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌ కటౌట్‌ హైలైట్‌ అయింది.

Continues below advertisement


'అర్జున ఫల్గుణ' టీజర్‌కు వస్తే... తన ప్రమేయం లేకుండా హీరో ఏదో సమస్యలో ఇరుకున్నట్టు అర్థమవుతోంది. 'నాది కాని కురుక్షేత్రంలో... నాకు తెలియని పద్యవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా... బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు. అర్జునుడిని' అంటూ శ్రీవిష్ణు మీసం మీద చెయ్య వేసి చెప్పారు. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'జోహార్‌'తో దర్శకుడిగా పరిచయమైన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకుడు. టీజర్‌తో సినిమాపై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చూపించారు. విజువల్స్‌ బావున్నాయి.
అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, 'రంగస్థలం' మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ సంగీతం అందించారు. సుధీర్‌ వర్మ పి మాటలు రాశారు. ఎన్ఎమ్ పాషా సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: మా ఆవిడకు ఆ సినిమా చూపించను! ఒకవేళ చూస్తానంటే...
Also Read: ఓరి దేవుడా... విశ్వక్‌ను అమ్మాయి ఎలా లాగుతుందో చూశారా?
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
Also Read: పూనమ్ పాండే జుట్టు పట్టుకుని గోడకోసి కొట్టిన భర్త, అరెస్టు.. ఎందుకు కొట్టాడంటే..
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement