'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లోహితారెడ్డిని హీరో కార్తికేయ ప్రేక్షకులు అందరికీ పరిచయం చేశారు. వేదికపై ఆమెకు ప్రపోజ్ చేయాలనే ఐడియా ఎవరిది? ఆ తర్వాత ఏం జరిగింది? సినిమా ఇండస్ట్రీపై లోహితకు ఎంత అవగాహన ఉంది? వంటి అంశాలపై కార్తికేయతో చిట్‌చాట్...
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రపోజ్ చేయాలనేది సడన్‌గా వచ్చిన ఐడియానా? ముందే ప్లానింగా?
నేను ముందు రోజు అనుకున్నాను. తన (లోహిత)కు చెప్పలేదు. మా ఇంట్లోవాళ్లకూ, ఎవరికీ చెప్పలేదు. అంటే... ఇన్ని రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఎప్పుడూ ఐలవ్యూ చెప్పలేదు. (ఈ నెల 21)న పెళ్లి. మళ్లీ అటువంటివి చేయడానికి ఛాన్స్ రాదు. సో... లైఫ్‌లాంగ్ మా ఇద్దరికీ ఓ మెమరీలా ఉంటుందని, తనకూ పెళ్లికి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందని అలా చేశా.
ఫంక్షన్ అయిన తర్వాత లోహిత ఏమన్నారు?
'ముందు చెబితే రెడీ అయ్యేదాన్ని కదా! జనరల్‌గా నువ్వు అలాంటి పనులు చేయవుగా' అని లోహిత అంది. ప్రతిసారీ అలా చేయడం కుదరదు. జీవితంలో ఒకసారి ఇలాంటిది ఉండాలని చేశా.
'ఆర్‌ఎక్స్ 100' సినిమా చూసి... మీతో ఆవిడ గొడవపడ్డారా?
యాక్చువల్లీ... 'ఆర్‌ఎక్స్ 100'టైమ్‌లో మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు. మేం గొడవ పడటం వల్ల తను సినిమా చూడలేదు. తర్వాత మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత చూస్తానంటే నేనే వద్దని చెప్పాను.
అయితే... ఆవిడ ఇంకా సినిమా చూడలేదా?
(నవ్వుతూ...) లేదు. ఎప్పుడైనా చూస్తానంటే సెకండాఫ్ నుంచి చూపిస్తా.
AlsoRead: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి ఆవిడకు చెప్పారా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయని...
అప్ అండ్ డౌన్స్ గురించి చెప్పాను గానీ... రొమాంటిక్ సీన్స్ గురించి చెప్పలేదు. తనే అర్థం చేసుకోవాలి. అది కామన్ కదా! మనం సరిగా ఉన్నప్పుడు సమస్యలు ఉండవు. ఆఫ్ ద స్క్రీన్ వెధవ పనులు చేస్తున్నట్టు డౌట్ వస్తే... అప్పుడు సమస్య వస్తుంది. లేదంటే ఏం కాదు.
లోహిత సినిమాలు బాగా చూస్తారా?
కాలేజీలో ఉన్నప్పుడు నేను ఆడిటోరియంలో డ్యాన్సులు, ప్రోగ్రామ్స్ చేసేవాడిని. తను బాగా చదివేది. గోల్డ్ మెడలిస్ట్. అప్పుడప్పుడూ నాతో సినిమాలు చూసేది. నేను హీరోగా చేస్తుండటం వలన తనకు, మా కుటుంబ సభ్యులకు సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఇతర సినిమాలు చూసి నాకు చెబుతున్నారు.
అసలు, మీ ఇంట్లో ప్రేమ సంగతి ఎప్పుడు చెప్పారు?
కొన్ని నెలల క్రితమే. తొలుత మా ఇంట్లో చెప్పాను. తర్వాత వాళ్లింట్లో చెప్పాను.
వెంటనే 'ఎస్' చెప్పారా...
అవును. పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాలేదు. అంటే... ముందే చిన్న చిన్న హింట్స్ ఇచ్చాను. బీటెక్‌లో ఉన్నప్పుడు నా ఫోన్‌లో ఓ మెసేజ్ ఇంట్లోవాళ్లు చూడటంతో సీన్ అయ్యింది. కాలేజీకి వెళ్లి చేస్తున్నదేమిటి? అని ఇంట్లో గట్టిగా అడిగారు. ఏదో ప్రాంక్ అని చెప్పాను. కవర్ చేశా. అప్పుడు మెసేజ్ చేసింది లోహితకు అని తెలియదు. 'ఆ అమ్మాయే ఈ అమ్మాయి' అని రీసెంట్‌గా చెప్పాను. ఇన్నేళ్ల ప్రయాణంలో నమ్మకం వచ్చింది. 'ఒకరికొకరు తెలుసు కదా!' అని ఓకే చెప్పేశారు.
డెస్టినేషన్ వెడ్డింగా? హైదరాబాద్‌లోనా?
హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకుంటున్నాను.
Also Read: 'ది గాడ్ ఫాదర్' కూడా 'జై భీమ్' తర్వాతే.. ఆ 250 చిత్రాల లిస్టులో టాప్ వన్ గా మెుదటి తమిళ సినిమా
Also Read: ఓరి దేవుడా... విశ్వక్‌ను అమ్మాయి ఎలా లాగుతుందో చూశారా?
Also Read: కేక పుట్టించే 6 కొరియన్ వెబ్‌సీరిస్‌లు ఇవే.. థ్రిల్లే కాదు.. దిల్ కూడా దోచుకుంటాయ్!
Also Read: పూనమ్ పాండే జుట్టు పట్టుకుని గోడకోసి కొట్టిన భర్త, అరెస్టు.. ఎందుకు కొట్టాడంటే..
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంటకు డడన! 'బంగార్రాజు' లడ్డుండా!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి