తమిళనాడులో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా.. తెరకెక్కింది జై భీమ్ చిత్రం. అమెజాన్ లో నవంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అప్పటి నుంచి సినిమా పేరు.. మారుమోగి పోతుంది. తాజాగా ఐఎండీబీ 250 చిత్రాల జాబితాలోకి చేరిపోయింది. ఐఎండీబీ రేటింగ్స్  లో జై భీమ్ సినిమా 8.1 రేటింగ్‌తో నిలిచింది. ఇప్పటి వరకూ ఏ తమిళ సినిమాకు ఇంతలా రేటింగ్స్ రాలేదు. అయితే మెుదట 9.6 రేటింగ్ తో టాప్ వన్ లో ఉంది.  కొన్ని గంటల తర్వాత 180వ స్థానానికి చేరుకుంది. ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్ వల్ల ఈ హెచ్చుతగ్గులు మారుతూ ఉంటాయి.


ది శశాంక్ రిడెంప్షన్ ఆఫ్ ఫ్రాంక్ డారాబాంట్, గాడ్ ఫాదర్, డార్క్ నైట్, 12 యాంగ్రీ మెన్ మొదలైన చిత్రాలు ఐఎండీబీ 250 చిత్రాల టాప్ లో ఉన్నాయి.  మొత్తం 250 చిత్రాల జాబితాలో ఒక్క తమిళ చిత్రం కూడా లేదు. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, లగాన్, దంగల్, పల్ప్ ఫిక్షన్, అన్‌ఫర్గివెన్ లాంటి చిత్రాలు మాత్రమే ఐఎండీబీ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు జై భీమ్ సినిమాకు ఆ ఘనత దక్కింది.  ఐఎండీబీ ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్లను బట్టి మాత్రమే ర్యాంక్ ఇస్తుంది. 


నవంబర్ 1న అమెజాన్ ప్రైమ్‌లో ‘జై భీమ్’ విడుదలైంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజం చెప్పాలంటే.. మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. కథలో సహజత్వం ఉంటే.. సినిమాను ఎలా ఆదరిస్తారో చెప్పేందుకు జై భీమ్ మంచి ఉదాహరణ. 1995 సంవత్సరంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. పోలీసుల కర్కశత్వాన్ని చూపిస్తూ.. బాధితురాలి తరఫున పైసా తీసుకోకుండా న్యాయవాది చంద్రు ఎలా కేసును గెలిపించాడనేది ఈ చిత్రంలో చూడొచ్చు. టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు. సినిమా చూసిన తర్వాత ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.





‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. చంద్రు, రాజన్న, సినతల్లి క్యారెక్టర్లు జనాలకు గుర్తుండిపోయేలా చేశారు. చంద్రుగా సూర్య, సినతల్లిగా లిజోమోల్ జోస్, రాజన్నగా కె.మణికందన్ వారి పాత్రల్లో జీవించేశారు. 


Also Read: Raghava Lawrence: రియల్ రాజన్న భార్యకు ఇల్లు... రాఘవా లారెన్స్ గొప్ప మనసు!


Also Read: 'Jai Bhim' Sinathalli: 'జై భీమ్' సినిమాలో 'సినతల్లి'గా నటించిన ఆమె గురించి మీకు ఈ విషయాలు తెలుసా..!


Also Read: Jai Bhim: 'జై భీమ్' చూశాక 37 ఏళ్లు వెనక్కి వెళ్లా... ఆమె నా కళ్లల్లో మెదిలింది - సీపీఐ నారాయణ