'జై భీమ్'... వాస్తవంగా జరిగిన కథను తీసుకుని సినిమాగా తీశారు. ఓటీటీలో సినిమా విడుదలైనప్పటి నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టు చూపించారని పలువురు ప్రశంసిస్తున్నారు. అయితే... హీరో, దర్శకుడు, నృత్య దర్శకుడు రాఘవా లారెన్స్ ఓ అడుగు ముందుకు వేశారు. 'జై భీమ్' చిత్ర బృందాన్ని అభినందించడంతో పాటు రియల్ రాజన్న భార్యకు ఓ ఇల్లును బహుమతిగా ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు.


తెలుగులో రాజన్నగా చూపించారు కదా! తమిళనాడులో రాజకన్ను అనే గిరిజన వ్యక్తి కథ అది. ఆయన భార్య పేరు పార్వతి అమ్మాళ్. ఆవిడ ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఓ పూరి గుడిసెలో జీవితం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన చలించిపోయిన రాఘవా లారెన్స్, ఆమెకు ఇల్లు కట్టిస్తున్నట్టు చెప్పారు. తెలుగులో పార్వతిని సినతల్లిగా చూపించారు. నిజ జీవితంలో...  పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైనా, న్యాయం కోసం పార్వతి పోరాడిన తీరు, పలువుర్ని కదిలించింది. సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు తెప్పించింది.






నృత్య దర్శకుడిగా... ఆ తర్వాత దర్శకుడిగా, కథానాయకుడిగా రాఘవా లారెన్స్ ఎంత పేరు తెచ్చుకున్నారో? సమాజ సేవ ద్వారా కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. పలువురు పేద విద్యార్థులను చదివించడం, అనారోగ్యంతో ఉన్నవాళ్లకు చికిత్స చేయించడంతో పాటు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం రాఘవా లారెన్స్ ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే... దానిపై ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. పార్వతికి ఇల్లు కట్టించడానికి ఆయన ముందుకు రావడంపై పలువురు ప్రశంసిస్తున్నారు. 


Also Read: ఖం... ఖం... కంగుమంది 'అఖండ' శంఖం! ధర్మభేరి శబ్దం... చెయ్యమంది యుద్ధం!
Also Read: 'టైగర్' పంచాయతీ... రవితేజ, బెల్లంకొండ మధ్య చర్చలు!?
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి