ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు లేదా ఏడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ(BAC) భేటీలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారో ఖరారు కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !


బీఏసీలో పూర్తి నిర్ణయం


ఈ నెల18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల18,19 తేదీలో రెండు రోజులు సభను నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 20, 21, తేదీల్లో సెలవుగా కేటాయిస్తారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఐదు రోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిచాలని వైసీపీ ప్రభుత్వం(Ysrcp Govt) నిర్ణయించినట్లు సమాచారం. ఈ తేదీలపై పూర్తి స్పష్టతను ఈ నెల 18న జరిగే బీఏసీ సమావేశంలో రానుంది. ఇప్పటికే ఏ సమస్యలపై సభలో చర్చించాలనే దానిపై నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.


Also Read: గల్లీ బీజేపీ సిల్లీ రాజకీయాలు చేస్తుంది... 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ మాత్రం తెలియదా... మంత్రి కొడాలి నాని సైటర్లు


ఈ నెల 17న మంత్రి వర్గ సమావేశం


ఈ పరిణామాల మధ్య 17వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశం కీలకంగా మారింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు మంత్రివర్గం ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. ఈసారి సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి అధికార పార్టీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ, పరిపాలన రాజధానిగా(Executive Capital) ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలు చేయాలన్న నిర్ణయంపై ఇకపై జాప్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


టీడీపీ నిర్ణయంపై ఉత్కంఠ


ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈసారి ఏంచేస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు పెరిగాయని ఆరోపిస్తూ టీడీపీ బడ్జెట్ సమావేశాలకు(Budget Session) హాజరుకాలేదు. అప్పట్లో టీడీపీ మాక్ అసెంబ్లీని నిర్వహించింది. ఈ సారి ఆ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశాలను కూడా బహిష్కరిస్తుందా... లేక సభకు హాజరవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. 


Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి