తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. ఎమ్మెల్యే కోటాలో తెలంగాణలో ఆరు, ఏపీలో మూడు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు కావాల్సినంత బలం ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నాయి. తెలంగాణలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఇదివరకు పనిచేసిన ఆకుల లలిత, ఫరుదుద్దిన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ రావు, బోడకుంట వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల పదవికాలం ఈ ఏడాది జూన్ 3తో ముగిసింది. ఏపీలోనూ ముగ్గురు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటికి ఇంతకు ముందే ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. వాటిని ఇప్పుడు నిర్వహిస్తోంది. 


Also Read : రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?
  
మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాలో పదవీ కాలం ముగియనున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 , తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.  షెడ్యూల్ విడుదల కావడంతో  ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. నామినేషన్లను నవంబర్ 16నుంచి స్వీకరిస్తారు. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. 14న కౌంటింగ్ చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.


Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికం గెల్చుకంది. ఈ కారమంగా ఏపీలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఏకగ్రీవం అయ్యే వకాశాలు ఉన్నాయి. తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. అత్యధికంగా స్థానిక సంస్థల ప్రతినిధులు టీఆర్ఎస్ నేతలే. దీంతో ఆ పార్టీకి కూడా అన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పోటీ ఉండే అవకాశం ఉంది. 


Also Read : అది ఫామ్ హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్.. సీదా ఒక్కటే అడుగుతానా వడ్లు కొంటరా? కొనరా?


అటు వైఎస్ఆర్‌సీపీకి.. ఇటు తెలంగాణ రాష్ట్ర సమితికి అభ్యర్థుల ఎంపికే సవాల్‌ గా మారింది. ఆశవాహులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ.. ముందుకు వెళ్లాల్సి ఉంది. అలాగే హామీ ఇచ్ిచన నేతలను సంతృప్తి పరచాల్సి ఉంది. అయితే పెద్ద ఎమ్మెల్సీ స్థానాలు ఉండటంతో రెండు అధికార పార్టీల ఆశావహుల్లో సందడి నెలకొంది. తమ వంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. 


Also Read : టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి