ఎయిడెడ్ విద్యాసంస్దలపై ఏపి  సిఎం జగన్ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్దల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్దలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించంది. దీంతో ఏపిలోని అనేక కళాశాలలో విద్యార్దులు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఘర్షణకు దారితీస్తున్నాయి. అనంతపురంలో విద్యార్దులపై లాఠీఛార్జి చేయడంతో మరో మారు ఎయిడెడ్ పై సీఎం జగన్ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్దుల ఆగ్రహానికి కారణాలేంటి..?  ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వచ్చే నష్టమేంటి.? ఒకవేళ ఆస్తులను అప్పగించేందుకు ఎయిడెడ్ విద్యాసంస్దల యాజమాన్యం ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం ? ఏపిలో ఎయిడెడ్ రచ్చపై వాస్తవాలేంటి..?


Also Read : రసవత్తరంగా నెల్లూరు ఎన్నికలు... కండువాలు మార్చేస్తున్న అభ్యర్థులు... తాజా లిస్ట్ ఇదే..!


ఎయిడెడ్ విద్యా సంస్థలు అంటే ?


ఎయిడ్ విద్యాసంస్దలంటే ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కొందరు దాతల సహకారంలో నిర్మించి, నడపబడుతున్న స్కూల్స్, జూనియర్ కాలేజిలు, డిగ్రీ కాలేజిలు. మొదట్లో పూర్తి నిధులు దాతలు భరించినా ఆ తరువాత ప్రభుత్వ సహకారంతో నడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎయిడెడ్ విద్యాసంస్దల్లో ఉపాధ్యాయులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. జీతాలు కాకుండా మిగతా నిర్వహణ ఖర్చులు మాత్రమే ఆయా ఎయిడెడ్ యాజమాన్యాలు భరిస్తున్నాయి.


Also Read : పెట్రో ధరల తగ్గింపుపై చేతులెత్తేసిన తెలుగు రాష్ట్రాలు... తగ్గించేదిలే అని ప్రభుత్వాలు స్పష్టం...!


ఇస్తే ప్రభుత్వానికి లేకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలని జగన్ సర్కార్ ఆదేశం ! 
 
తాజాగా జగన్ సర్కార్ ఎయిడెద్ విద్యాసంస్దలను స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయంతో జీవో నెంబర్ 35,42, 50 లను అమల్లోకి తెచ్చింది. ఏపిలో ఎయిడ్ విద్యాసంస్దలపై ప్రభుత్వ కన్ను ఇప్పటి మాటకాదు. గత ఇరవై ఏళ్లుగా ఎయిడెడ్ విద్యాసంస్దల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడం లేదు. కొత్తగా నియామకాలు పెద్దగా చేయలేదు. ఎయిడెడ్ విద్యాసంస్దలపై జగన్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.


Also Read: ఏపీకి పాలు సరఫరా బంద్.... రూ.130 కోట్ల బకాయిలు చెల్లించండి... ఏపీకి కర్ణాటక లేఖ


టీచర్లను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ! 


ఏపిలో ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఎయిడెడ్ జూనియర్ కాలేజిలు 122 , ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు 137 ఉన్నాయి. ఈ విద్యాసంస్దలు తాజా జీవోలతో తమ ఆస్తులతో సహా ఏపి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. అలా చేయకుంటే వారి ముందున్న మరో ఆప్షన్  సొంత నిధులతోనే విద్యాంస్దలను నడుపుకోవడం. అంటే ఇన్నాళ్లు ఆయా విద్యాసంస్దల్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులంతా ప్రభుత్వ అధీనంలోకి వెళ్లిపోతారు. ఎయిడ్ విద్యాసంస్దల యాజమాన్యాలే తిరిగి ఉపాద్యాయులను సొంత నిధులతో నియమించుకుని .. జీతాలు చెల్లించడం చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి స్వాధీనం చేయని ఎయిడెడ్ విద్యాసంస్దలలకు ప్రభుత్వం ఎయిడ్ ఆపేస్తుంది. అంటే అది ప్రైవేటు విద్యా సంస్థ అయిపోతుందన్నమాట.


Also Read: ఏపీ, తెలంగాణకు కేఆర్ఎంబీ ఛైర్మన్ లేఖ.... శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు అప్పగించాలని ఆదేశాలు


విద్యా ప్రమాణాలు పెంచేందుకేనంటున్న ప్రభుత్వం !


విద్యాప్రమాణాలు పెంచేందుకు, మౌళిక సదుపాయాలు కల్పించేందుకే ఈ నిర్ణయం అంటూ జగన్ సర్కారు చెబుతోంది. అంతే కాదు ప్రభుత్వ నిధులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయనే అసంతృప్తి కూడా మరో కారణంగా చూపుతోంది. ఎయిడెడ్ ఆస్తులపై ప్రభుత్వ కన్నుపడిందని .. అవి ఆక్రమించుకోవడానికే ఇది కొత్త ఎత్తుగడ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 


Also Read : అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత


ఆగమ్యగోచరంగా విద్యార్థుల భవిష్యత్ ! 


ఈ నిర్ణయంతో ఎక్కవ నష్టపోయేది ఎయిడెడ్ విద్యాసంస్దల్లో చదువుతున్న విద్యార్దులే. ప్రభుత్వానికి ఎయిడ్ ఆస్తులు స్వాధీనం చేస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. అలా కాకుండా  ఎయిడెడ్ విద్యాసంస్దలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఇష్టలేని ఎయిడ్ యాజమాన్యాలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో విద్యార్దుల భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారుతోంది. అలా కాకుండా తామే నడుపుకునేందుకు సిద్దమైతే ఇక అవి ప్రవేటు విద్యాసంస్దలను తలపించేలా అధిక ఫీజులు వసూలు చేసే అవకాశాలే ఎక్కువ. అందుకే విద్యార్ది లోకం మండిపడుతోంది. నిరసన బాట పట్టింది. ప్రభుత్వం ఈ నిర్ణయంపై వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది.  


Also Read: ఆయన కంఠంలో ‘ఉక్కు’ తూటా! స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోపోరుకు సిద్ధమైన శంకరరావు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి