పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా పెంచేసి ఇప్పుడు కాస్త రూ. 5-10 తగ్గించిందని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రజలకు పెట్రో వాత పెట్టి ఆయింట్ మెంట్ పూసినంత మాత్రాన బీజేపీని ప్రజలు కనికరిస్తానుకోవడం వారి భ్రమే అవుతుందని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడగొట్టారన్నారు. తిరుపతి, బద్వేల్ ఉపఎన్నికల్లో డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని గల్లీ బీజేపీ సిల్లీ రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకు తిరిగే చంద్రబాబు(Chandrababu) కూడా, బీజేపీకి తోక పార్టీగా తయారై, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రైవేట్ వ్యక్తులు నడిపే పెట్రోలు బంకుల దగ్గర నిరసన చేయాలని పిలుపు ఇవ్వడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు పెట్రోలు ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తారా లేక ప్రధాని తగ్గిస్తారా అన్న విషయం తెలిసి కూడా తెలియనట్టుగా మాట్లాడుతున్నాడంటూ దుయ్యబట్టారు. పెట్రో ధరల పెంపుపై చంద్రబాబు నిరసనలు చేయాల్సింది రాష్ట్రంలోని పెట్రోలు బంకులు దగ్గర కాదని, నల్ల చొక్కాలు వేసుకుని దిల్లీలో ధర్నా(Protest) చేయాలని హితవు పలికారు. 



Also Read: కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?


అప్పులు తెచ్చి రోడ్లు వెయ్యలేదు


రాష్ట్రంలో రోడ్లు వేస్తానని, మరమ్మత్తులు  చేస్తామని గత ప్రభుత్వం బ్యాంకులనుంచి అప్పులు తెచ్చి, రోడ్లు వేయకపోగా ఆ అప్పు కూడా తీర్చలేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు. అందువల్లే ఇప్పుడు పెట్రో, డీజిల్ పై రూపాయి సెస్ విధిస్తున్నామని చెప్పారు. అలానే అమరావతి రాజధాని అభివృద్ధి పేరుతో నాలుగున్నరేళ్ల పాటు పెట్రో ధరలపై లీటర్ కు రూ. 2 లు చొప్పున సర్ ఛార్జ్ వేసి, దాదాపు రూ. 10 వేల కోట్లు ప్రజల నుంచి లూటీ చేసింది చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని(Kodali Nani) ధ్వజమెత్తారు. కుప్పంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లోనూ చంద్రబాబును ఓడించి, టీడీపీని రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. 


ఉపఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారు


పెట్రోల్‌, డీజీల్‌ ధరల పెంపును ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓడించారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తే జనసేన మద్దతు ఇస్తే, టీడీపీ ఏజెంట్లను కూర్చోబెట్టి మూడు పార్టీలు కలిసి వైఎస్సార్‌సీపీ మీద పోటీ చేశాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్ బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించిందన్నారు. దేశంలో అధికారంలో ఉన్నచోట కూడా బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిందన్నారు. లీటర్ రూ.70 ఉన్న పెట్రోల్‌ ధరను రూ.118 పెంచి చివరకు రూ.5 తగ్గించి ప్రజలను మభ్యపెట్టాలని బీజేపీ చూస్తుందని మంత్రి ఆరోపించారు. ప్రజలకు వాతలు పెట్టి ఆయింట్‌మెంట్‌ రాస్తే ప్రజలు కనికరిస్తారనే భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారని విమర్శించారు. 


Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


కేంద్రం దోచుకుంటుంది


రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ట్యాక్స్‌లు ఎగొట్టేందుకు ఎక్సైజ్‌ డ్యూటీని కేవలం రూ.47 వేల కోట్లు మాత్రమే కేంద్రం చూపిస్తుందని మంత్రి కొడాలి ఆరోపించారు. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.19 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. అది కాకుండా సర్‌ఛార్జ్(Surcharge) రూపంలో  రూ.74 వేల కోట్లు, మౌలిక వసతులు, రోడ్డు నిర్మాణాల ట్యాక్స్‌ రూ.లక్షా 98 వేల కోట్లు, పెట్రో ఉత్పత్పుల మీద పన్ను పేరుతో రూ.15 వేల కోట్లు ఇవన్నీ దాదాపు ఏడాదికి  ప్రజల నుంచి రూ.3 లక్షల 50 వేల కోట్లు కేంద్రం దోచుకుంటుదని విమర్శించారు.


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !


చంద్రబాబుపై తీవ్ర విమర్శలు


చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని అభివృద్ధి చేయడానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని, లీటరుపై రూ.2 సర్‌ ఛార్జ్‌ వేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రంలో రెండు రూపాయిల సర్‌ఛార్జ్‌ వేసి నాలుగున్నరేళ్లు అమలు చేసి, దాని ద్వారా  రాష్ట్ర ప్రజల నుంచి రూ.10 వేల కోట్లు లూటీ చేసింది గత ప్రభుత్వమని విమర్శించారు. 2019 ఎన్నికలు జరిగే మూడు నెలల ముందు రూ.2 సర్‌ఛార్జ్‌ తగ్గించారన్నారు. ఇవాళ పెట్రో ధరలు పెంచి బీజేపీ(BJP) ఎలా తగ్గించిందో అలాగే చంద్రబాబు ఎన్నికల ముందే ఈ పని చేశారన్నారు. 


Also Read: ఢిల్లీలో ఏపీ గవర్నర్ మూడు రోజుల పర్యటన ! కేంద్రానికి నివేదికలిస్తారా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి