ఏపీలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న నియోజకవర్గ కేంద్రం కుప్పం. ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. నువ్వా..నేనా.. అంటూ వైసీపీ వర్సెస్ టీడీపీ టెన్షన్ మెుదలైంది. నిన్న, మొన్నటి వరకు జరిగినఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీ నడుమ ఘర్షణలు భగ్గుమని మండుతూనే ఉన్నాయి. ఈ నెల 15 న కుప్పంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అయితే ఇదే విషయంపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 14వ వార్డు ఏకగ్రీవంపై టీడీపీ నాయకులు అధికారులను నిలదీశారు. కార్యాలయం వద్ద కమిషనర్ తో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. పోలీసులకు,టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయంలో నుండి టీడీపీ నాయకులను, కార్యకర్తలను బయటకు నెట్టి వేసే క్రమంలో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డిపై, ఎమ్మెల్యే రామానాయుడుపై పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద మరింత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఈ విషయం తెలిసి.. మున్సిపల్ కార్యాలయం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కుప్పం మున్సిపల్ అభ్యర్థుల విత్ డ్రా సమయం దాటి రాత్రి కావస్తున్నా పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించ లేదని నిలదీశారు. జాబితా ప్రకటించే వరకు వెళ్ళేది లేదని టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. కుప్పం 14వ వార్డులో తమ అభ్యర్థి రాకుండా ఎలా ఉపసంహరణ జరిగిందని అర్వోను ప్రశ్నించారు.
ఎన్నికల అధికారి వైసీపీకి తొత్తుగా మారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల బైఠాయించారు. అదనపు పోలీసు బలగాలతో టీడీపీ నేతలను పోలీసులు బయటకు నెట్టివేశారు. తోపులాటలో ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డిని పోలీసులు తోసేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల భారీగా మోహరించారు. కుప్పం మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ చీరను టీడీపీ అందజేసే ప్రయత్నం చేశారు.
Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు.. 74 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు..
Also Read: Hyderabad: కన్నతల్లి ఇంట్లోనే కూతురు దొంగతనం.. గంటల్లోనే అడ్డంగా దొరికిపోయింది ఇలా..
Also Read: Panjagutta Girl Death: పంజాగుట్ట బాలిక మిస్టరీ కేసులో స్పష్టత, చనిపోయింది అందుకే.. కానీ,
Also Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులు