టీ20 వరల్డ్‌కప్‌లో చివరి సూపర్ 12 మ్యాచ్‌లో భారత్ నమీబియాతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వీస్ టాప్ స్కోరర్. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వరకు సాఫీగానే నడిచింది. మొదటి వికెట్‌కు 4.4 ఓవర్లలోనే 33 పరుగులు జోడించిన అనంతరం మైకేల్ వాన్ లింగెన్‌ను అవుట్ చేసి బుమ్రా భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత జడేజా, అశ్విన్ కలిసి నమీబియాను తిప్పేశారు.
వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో నమీబియా బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలుదొక్కుకోలేకపోయారు. వీరు పరుగులు కూడా ఎక్కువ ఇవ్వలేదు. అశ్విన్ నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇవ్వగా.. జడేజా కేవలం 16 పరుగులే ఇచ్చాడు.
ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్, ఎనిమిదో వికెట్‌ను బుమ్రా తీయగా.. మధ్యలో ఆరు వికెట్లను వీరిద్దరే తీశారు. నమీబియా బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. డేవిడ్ వీస్, మరో ఓపెనర్ స్టీఫెన్ బార్డ్ మినహా ఎవరూ 20 పరుగులు కూడా దాటలేకపోయారు. దీంతో నమీబియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ.. సెమీస్ అవకాశాలు మాత్రం లేవు. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అవ్వడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. అయితే విరాట్ కోహ్లీకి టీ20 కెప్టెన్‌గా ఇది ఆఖరి మ్యాచ్.
Also Read: టీ20 కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులు ఇవే.. ఆ విషయంలో ఇప్పటికీ నంబర్ వన్
Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?
Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!
Also Read: Ravi Shastri: కొత్త ఐపీఎల్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి.. ఏ జట్టుకంటే?
Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్ ఔట్.. సెమీస్‌కు కివీస్