బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోనే సందడి చేయాల్సిన లోబో 5 లో హౌస్ లో అడుగుపెట్టాడు. ఈ సీజన్‌లో ఆరో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు లోబో. సీక్రెట్ రూమ్ లో కి వెళ్లకముందు..వెళ్లిన తర్వాత లోబో క్రేజ్ తగ్గింది. సీక్రెట్ రూమ్ ప్లస్ అవుతుందనుకుంటే అక్కడి నుంచి తిరిగి హౌజ్ లో అడుగుపెట్టిన తర్వాత మరింత డల్ అయిపోయాడు లోబో. ఎలిమినేట్ అయిన బయటకొచ్చిన తర్వాత ఇంటర్యూలు, పలు షోస్ తో బిజీగా ఉన్న లోబో కామెడీ స్టార్స్ షోలో సందడి చేశాడు.
రజనీకాంత్ సినిమా రోబో...ఎంటర్ టైన్మెంట్ కావాలంటే లోబో అంటూ మొదలైన ప్రోమో మొదట్లో సందడిగా అనిపించినా ఆ తర్వాత సీరియస్ క్వశ్చన్ వేయడంపై లోబో ఫైరయ్యాడు. బిగ్ బాస్ లోకి వారు పిలిచారా మీరు వెళ్లారా, ముళ్లపంది- దున్నపోతు మీరు ఒప్పుకుంటున్నారా, పెళ్లైందనే విషయం గుర్తుందా..ఉమాతో సరసాలు ఆడారు కదా అప్పుడు మరిచిపోయారా, నవ్వించడానికి వెళ్లి నవ్వులపాలై బయటకు వచ్చారు అన్న వరుస ప్రశ్నలు విని లోబో ఇరిటేట్ అయ్యాడు. నా ఇష్టం అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. అయితే ఈ సీరియస్ నెస్ అంతా ప్రోమో వరకే షో అంతా సదండే అని టాక్.
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
ఇక హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు చిత్రవిచిత్రంగా కనిపించే లోబోని చూసి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు. సెలబ్రిటీలకి కూడా లోబో అంటే మంచి అభిప్రాయమే. లోబో అసలు పేరు మహమ్మద్ ఖయ్యూం. చదువు మధ్యలోనే ఆపేసి ఆ తర్వాత ఓటాటూ షాపులో పనిచేశాడు. అక్కడ ఓ రష్యన్ యువతికి తొలి టాటూ వేశాడు. లోబో లుక్ డిఫరెంట్ గా ఉండడంతో ఆమె పెట్టింది ఆపేరు. అప్పటి నుంచి ఖయ్యూం..లోబోలా మారి ఎంటర్టైన్ చేస్తున్నాడు.
Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్ అభిమానిగా శ్రీవిష్ణు
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి