టీఎస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచిన కారణంగా.. హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థలకు లీగల్ నోటీస్ లు పంపించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్టీసీ ఎండీ.. యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని.. అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.
Also Read: 'నాతో బెడ్ షేర్ చేసుకుంది ఎవరో తెలుసా..?' విజయ్ ట్వీట్ వైరల్..
ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక మంది నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ తెలిపారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
టీఎస్ ఆర్టీసీని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం, ప్రయాణికులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరని.. వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ నటించాలని అన్నారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందని.. అందుకే నటునికి.. ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు పంపుతున్నామని వెల్లడించారు. అలానే బస్ స్టేషన్లలో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించేవారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. బస్సుల్లో, బయట.. పాన్, గుట్కా ఉమ్మేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నోటీసులపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ హీరో 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'శ్యామ్ సింగరాయ్' రీమేక్ లో హృతిక్ రోషన్.. నిజమేనా..?
Also Read:దెయ్యాలతో కలిసి జీవించిన 'ఎటర్నల్స్' ఫేమ్.. చివరకు ఏం చేసిందంటే..?
Also Read: స్టార్ హీరోని కొడితే రూ.1001 బహుమతి.. ఓపెన్ ఆఫర్..
Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ
Also Read: సిక్స్‌ప్యాక్ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి