నిన్న జరిగిన నామినేషన్స్ గురించి హౌస్ మేట్స్ మాట్లాడుకున్నారు. ప్రియాంక.. షణ్ముఖ్ ఒళ్లో పడుకొని ఏడ్చేసింది. తనకు ఏదీ సరిగ్గా అర్ధం కాదని.. అంత బ్రెయిన్ లేదని చెప్పింది. ఈ నామినేషన్ వలన కాజల్, ప్రియాంకల గురించి తనకు తెలిసిందని మానస్.. సన్నీతో అన్నాడు. జెస్సీ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుందని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి చెప్పారు. మెయిన్ గేట్ నుంచి బయటకు రావాలని చెప్పారు. కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన జెస్సీ ఇంటి సభ్యులకు తాను వెళ్లిపోతున్నానని చెప్పాడు. హౌస్ మొత్తం ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. సిరి, షణ్ముక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరి అయితే తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. జెస్సీ వెళ్లిపోయిన తరువాత సిరి.. షణ్ముఖ్ ని పట్టుకొని ఏడ్చేసింది. మళ్లీ తిరిగి వస్తాడని ఇద్దరూ అనుకున్నారు. మరోపక్క కాజల్ కూడా కన్నీళ్లు పెట్టుకుంది.
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
మానస్.. ప్రియాంకను అవైడ్ చేస్తుండడంతో 'ఏమైనా తప్పు చేశానా..?' అంటూ అమాయకంగా అడిగింది. దానికి మానస్ తరువాత మాట్లాడతా అని చెప్పాడు. అదే విషయాన్ని కాజల్ కి చెప్పుకొని ఫీలై పోయింది ప్రియాంక. 'నువ్ మానస్ కోసం బిగ్ బాస్ కి వచ్చావా..?' అంటూ క్లాస్ పీకింది కాజల్. ఈ వారం వెళ్లిపోతానని తనతో సరిగ్గా ఉండమంటూ కాజల్ వెళ్లి మానస్, సన్నీలతో చెప్పింది. కాజల్ ఎన్నిసార్లు సారీ చెప్పినా.. సన్నీ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు.
సీక్రెట్ రూమ్ లో జెస్సీ..
మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్లిన జెస్సీకి ట్రీట్మెంట్ ఇప్పించి.. ఆ తరువాత క్వారెంటైన్ లో భాగంగా అతడిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు బిగ్ బాస్. రవి-శ్రీరామ్-యానీ మాస్టర్.. వాక్ చేస్తూ మానస్-సన్నీల గురించి మాట్లాడుకున్నారు. సన్నీ జెన్యూన్ ఉంటాడని.. కానీ మానస్ అలా కాదని అనుకున్నారు.
ఇక తెల్లవారుజామునే మానస్ తో డిస్కషన్ పెట్టింది ప్రియాంక. మానస్ ఆమెని దూరం పెట్టడంతో కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసిన రవి.. వీడు(మానస్) బాధ పడట్లేదు.. అవతలి వాళ్లు బాధపడేలా చేస్తున్నాడని కామెంట్ చేశాడు. ఇక మానస్-సన్నీ కూర్చొని జెస్సీ-శ్రీరామ్-రవి కలిసి కాజల్ ని మానిప్యులేట్ చేశారని.. అందుకే ఆమె షణ్ముఖ్ ని సేవ్ చేసిందని మాట్లాడుకున్నారు. జెస్సీ మాత్రం తెలివిగా తన ఫ్రెండ్ షణ్ముఖ్ ని కాపాడుకున్నాడని అనడంతో సీక్రెట్ రూమ్ లో నుంచి మొత్తం విన్నాడు జెస్సీ.
మళ్లీ సిరి-షణ్ముఖ్ గొడవ పడ్డారు. ఎందుకు అలుగుతాడో తెలియదు, ఎందుకు నవ్వుతూ మాట్లాడతాడో తెలియదు అంటూ తనలో తనే మాట్లాడుకుంది సిరి. థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు తనపై జోకులు వేయొద్దని సిరికి చెప్పాడు షణ్ముఖ్.
నువ్ నన్ను ఎందుకు సేవ్ చేశావని శ్రీరామ్ ని ప్రశ్నించింది కాజల్. మంచి ఉద్దేశంతోనే బయటకు తీసుకొచ్చానని చెప్పాడు శ్రీరామ్. ఆ తరువాత రవి.. షణ్ముఖ్ ని హౌస్ మేట్స్ ముందు ఇమిటేట్ చేశాడు. అందరూ నవ్వుకున్నారు. దీంతో షణ్ముఖ్ కి కోపమొచ్చింది. అందుకే ఎవరికీ అంత ఛాన్స్ ఇవ్వనని.. ఇలానే వెకిలి జోకులు వేస్తారంటూ రవిపై సీరియస్ అయ్యాడు షణ్ముఖ్. ఏదో సరదాగా చేశానని రవి చెప్పినా.. షణ్ముఖ్ ఊరుకోలేదు. పింకీ తనను టార్గెట్ చేసిందని.. ఇకపై చూపిస్తా అంటూ సిరితో అన్నాడు షణ్ముఖ్.
Also Read: 'శ్యామ్ సింగరాయ్' రీమేక్ లో హృతిక్ రోషన్.. నిజమేనా..?
Also Read:దెయ్యాలతో కలిసి జీవించిన 'ఎటర్నల్స్' ఫేమ్.. చివరకు ఏం చేసిందంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి