బిగ్ బాస్ సీజన్ 5 పదో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం ఎపిసోడ్ లో విశ్వ ఎలిమినేట్ కాగా.. సోమవారం నాడు నామినేషన్స్ జరిగాయి. అందులో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కాస్త ఫన్నీగా.. కాస్త ఎమోషనల్ గా సాగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక ప్రోమో వచ్చింది. అందులో జెస్సీ అనారోగ్య కారణాల వలన హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో.. జెస్సీ మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్లాడు. దీంతో సిరి, షణ్ముఖ్ చాలా ఎమోషనల్ అయిపోయారు. తాజాగా మరో ప్రోమో రాగా.. దాన్ని చాలా ఫన్నీగా ఎడిట్ చేశారు. 


Also Read: 'నాతో బెడ్ షేర్ చేసుకుంది ఎవరో తెలుసా..?' విజయ్ ట్వీట్ వైరల్..


హౌస్ మేట్స్ కి కేక్ పీస్ పంపించిన బిగ్ బాస్ 'ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది..?' అంటూ దానిపై క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అది చూసిన రవి.. క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి ఆయనకి ఆన్సర్ కావాలి అని అనేలోపు.. ఒకటి కాదు, మూడు క్వశ్చన్ మార్క్స్ అని యానీ మాస్టర్ అమాయకంగా అన్నారు. దానికి శ్రీరామ్ ఫన్నీగా.. 'మీరు గ్యాప్ అబ్సర్వ్ చేయలేదు.. గ్యాప్ కూడా ఉంది' అంటూ వెటకారంగా అన్నాడు. రవి ఏమో క్వశ్చన్ మార్క్ కూడా ఉల్టా సి ఉంది అని ఫన్నీగా అనగా.. 'అవును కదా' అంటూ యానీ అనడం కామెడీగా ఉంది. 


'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్ధం కావట్లేదు.. తీసి లటుక్కున తినేయనా..?' అని సన్నీ అనగా.. తినెయ్ అని కాజల్ చెప్పింది. ఇక యానీ మాస్టర్, శ్రీరామ్ ఆ కేక్ ముక్క చుట్టూ ఏముందా అని వెతకడం మొదలుపెట్టారు. ఆ తరువాత యానీ తను కెప్టెన్ అని తనకు తినే అర్హత ఉందని చెప్పగా.. సరే తినండి అంటూ సన్నీ అన్నాడు. దానికి ఆమె హౌస్ అందరూ కలిసి నిర్ణయించుకుంటే బెటర్ అని చెప్పింది. వెంటనే ప్రియాంక.. 'నాకు మానస్ కి ఇవ్వాలని ఉందని' కామెంట్ చేసింది. దానికి సన్నీ.. 'నువ్ అన్నీ ఆయనకు ఇచ్చుకో.. అన్నీ మానస్ కి మానస్ కి.. అక్కడ జైల్లో నేను కూడా ఉన్నాను. కనపడలేదా నీకు..?' అని ఫన్నీగా అనగా.. హౌస్ మేట్స్ అందరూ నవ్వేశారు. 






Also Read: 'శ్యామ్ సింగరాయ్' రీమేక్ లో హృతిక్ రోషన్.. నిజమేనా..?


Also Read:దెయ్యాలతో కలిసి జీవించిన 'ఎటర్నల్స్' ఫేమ్.. చివరకు ఏం చేసిందంటే..?


Also Read: స్టార్ హీరోని కొడితే రూ.1001 బ‌హుమ‌తి.. ఓపెన్ ఆఫర్..


Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!


Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ


Also Read: సిక్స్‌ప్యాక్‌ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి