అల్లు అర్జున్,రష్మిక మందన హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ నుంచి పాటల వరకూ అదుర్స్ అనిపించాయి. రీసెంట్ గా ‘మంగళం శీను’ అంటూ సునీల్ లుక్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉంది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. దాక్షాయణిగా నటిస్తోంది అనసూయ.
నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఓ వైపు యాంకర్ గా మెప్పిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ ఇప్పుడు దాక్షాయణిగా కూడా అదిరిపోయే క్యారెక్టర్లో నటిస్తోందని లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. రీసెంట్ గా ‘థ్యాంక్యూ బ్రదర్’ అనే సినిమాలో కనిపించిన అనసూయ ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’ లో నటిస్తోంది. మొత్తంమీద క్యారెక్టర్స్ ఎంపికలో అనసూయ స్టైలే వేరప్పా అంటున్నారు అభిమానులు.
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి