కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన బీబీ హోటల్ నడుస్తోంది. హనీమూన్ కపుల్ గా హోటల్ కి వచ్చిన మానస్-ప్రియాంక కు ప్రత్యేక బెడ్ సిద్ధం చేసింది మ్యానేజర్ అండ్ రిసెప్షనిస్ట్ యానీ. వాళ్లని సంతోషంగా తీసుకెళ్లి చూపించేలోగా సన్నీ ఆ బెడ్ పై పడుకున్నాడు. చీటికి మాటికీ మ్యానేజర్ అని పిలిచి యానీని బాగా ఏడిపించాడు. హనీమూన్ కపుల్ మానస్-ప్రియాంక డిన్నర్ చేస్తుండగా కావాలని వాళ్లని డిస్ట్రబ్ చేశాడు. బిల్డప్ ఏంటని అనడంతో ప్రియాంక రియాక్టైంది. హీరోయిన్ అని కాంప్లిమెంట్ ఇచ్చారని కూల్ చేశారు. డోర్స్ ఓపెన్ చేయాలని కొద్దిసేపు కామెడీ చేశాడు సన్నీ.  






ఇక హోటల్ స్టాఫ్ అతిథులకు ఇచ్చే సర్వీసెస్ కి ఆటంకం కలిగించేందుకు ప్రయత్నించి మిగిలిన వారికన్నా తనపని  నచ్చేలా చేసుకోవాల్సి ఉంటుందని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రవి ఆపనిలో ఉన్నాడు. ఇప్పటికే కాజల్ డబ్బులు దొంగిలించడంతో అదో పెద్ద హడావుడి నడుస్తోంది. తమ డబ్బులు తిరిగి ఇచ్చేవరకూ ఎవ్వరికీ మనీ ఇచ్చేది లేదని హోటల్ కి వచ్చిన అతిథులు చెప్పడంతో... మీరు డబ్బులివ్వకుంటే సర్వీస్ చేసేది లేదని హోటల్ స్టాఫ్ అన్నారు. ఇంతలో కాజల్, మానస్, సిరి దొంగతనంగా ఐస్ క్రీం తిన్నారు. గేట్ దగ్గరకి వెళ్లిన సన్నీ అటువైపు ఎవరున్నారు సార్ అంటూ కామెడీ చేశాడు...స్పందించిన షణ్ముక్ గేట్లు తీయండి బిగ్ బాస్ ఈయన వెళ్లిపోతాడంట అంటూ మరింత ఫన్ యాడ్ చేశాడు. మొత్తానికి ఇన్నాళ్లూ టాస్కుల సమయంలో వైల్డ్ గా రియాక్టైన ఇంటి సభ్యులు మొదటిసారి కామెడీ చేస్తున్నారని అంటున్నారు ప్రేక్షకులు.
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
బీబీ హోటల్ టాస్క్ లో ఎవరు ఏంటంటే...
షణ్ముఖ్ అండ్ శ్రీరామ్ - హోటల్ స్టాఫ్
యానీ మాస్టర్ - మ్యానేజర్ అండ్ రిసెప్షనిస్ట్..
రవి - ఉద్యోగాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే హౌస్ కీపింగ్
మానస్, ప్రియాంక - హోటల్ కి వచ్చిన హనీమూన్ కపుల్
కాజల్ - హోటల్ ఓనర్ కి స్నేహితురాలు, తనకు చాలా యాటిట్యూడ్
సన్నీ -  ఒక కాంటెస్ట్ లో గెలిచి 2 నైట్స్, 3 డేస్ కోసం మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన గెస్ట్.
సిరి - ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురు. 
Also Read: ‘3 రోజెస్’ ట్రైలర్.. అందరికీ విజయ్ దేవరకొండే కావాలంటే ఎలా.. ఇది పెద్దలకు మాత్రమే!
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి