దేవుణ్ని సాధారణంగా ఏం కోరికలు కోరుకుంటాం? ఆరోగ్యంగా ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు కలగాలని, చదువు బాగా రావాలని ఇలా కోరుకుంటారు. పెళ్లైన వాళ్లైతే పిల్లల కోసం ప్రార్థిస్తుంటారు. కానీ, ఓ భక్తుడు దేవుణ్ని కోరుకున్న కోరిక ఇప్పుడు సంచలనంగా మారింది. అతి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కర్ణాటకలోని హాసన్‌‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలివీ..


కర్ణాటకలోని హాసన్‌లో హాసనాంబ అనే చాలా ప్రసిద్ధ దేవత ఆలయం ఉంది. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకమైన ఆచారాన్ని అనుసరిస్తారు. ఈ గుడి 9 రోజులు మినహా ఏడాది పొడవునా మూసివేసే ఉంటుంది. ఈ 9 రోజుల్లోనే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దర్శనం కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడతారు. ఈ సంవత్సరం, ఆలయ తలుపులు భక్తుల కోసం అక్టోబర్ 28 నుండి నవంబర్ 6 వరకు తెరిచి ఉంచారు. నవంబరు 6న తలుపులు మూసివేశారు. ఈ క్రమంలోనే కానుకలు లెక్కించేందుకు ఆలయ నిర్వహకులు హుండీ తెరిచారు. అయితే, ఈసారి డబ్బు మాట అటుంచితే, ప్రజలు అమ్మవారికి రాసిన లేఖలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి.


Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


విచిత్రమైన అభ్యర్థనలు
“దయచేసి మా హోలెనరసిపుర నియోజకవర్గ ప్రజలను రక్షించండి. మాకు కొత్త ఎమ్మెల్యే రావాలి. హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుటుంబం రక్తం తాగుతారు. దయచేసి వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓడిపోయేలా చూడండి’’ అని ఓ భక్తుడు ఒక లేఖలో పేర్కొన్నారు. తన పెద్ద కొడుకు పెళ్లి అవ్వాలని మరో తల్లి ప్రార్థిస్తూ మరో లేఖ రాసింది. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల్లో 90 శాతం మార్కులు సాధించాలని కోరుతూ ఓ విద్యార్థి దేవతకు లేఖ రాశాడు.


Also Read: సెకండ్ జనరేషన్ కరోనా వ్యాక్సిన్లు వస్తే ప్రయోజనం.. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ కీలక వ్యాఖ్యలు


ఇంకో వ్యక్తి మరో ఆసక్తికరమైన లేఖ రాశాడు. హాసన్‌లోని వార్డ్ నంబర్ 35 నివాసి అయిన ఆయన తన ఇంటి సమీపంలోని రోడ్డుపై గుంతల సమస్యను పరిష్కరించాలని అభ్యర్థించారు. మరో భక్తుడు తన కోరికను లేఖలో ప్రస్తావించనప్పటికీ, ఆమె తన కోరికను నెరవేరిస్తే రూ.5 వేలను దేవుడికి ఆఫర్ చేశాడు.


తన భర్త మద్యపాన వ్యసనం నుండి బయటపడాలని చూడాలని ఓ మహిళ దేవతను వేడుకుంది. ఒక మహిళ రక్తంలో ముంచిన లేఖను రాసి కానుకల పెట్టెలో పడేసి, తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోనేలా చూడాలని దేవతను కోరింది. ఇవి మాత్రమే కాకుండా, పెళ్లి, సొంత ఇల్లు, పిల్లల భవిష్యత్తు, ప్రేమ, జీవితంలో విజయం, ఉద్యోగ ప్రమోషన్లు కోరుతూ ఎన్నో లేఖలు భక్తులు రాశారు. ఇలా చేస్తే వారి కోరికలు ఏ మాత్రం నెరవేరుతాయో తెలియనప్పటికీ ఈ సోషల్ మీడియా కాలంలో ఇలాంటి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?




 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి