ABP  WhatsApp

Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ABP Desam Updated at: 12 Nov 2021 01:34 PM (IST)
Edited By: Murali Krishna

కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

NEXT PREV

జమ్ముకశ్మీర్‌ మరోసారి ఎన్‌కౌంటర్‌లతో దద్దరిల్లింది. శ్రీనగర్, కుల్గాంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ మేరకు కశ్మీర్ పోలీస్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.






ఇద్దరు ఉగ్రవాదులు గురువారం మృతి చెందగా, మరొకరు శుక్రవారం ఉదయం జరిగిన ఆపరేషన్‌లో హతమయ్యాడు. అయితే గురువారం ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదిని ఆమిర్ రియాజ్‌గా పోలీసులు గుర్తించారు. రియాజ్.. ఉగ్రవాద సంస్థ ముజాహిద్దీన్ గజ్వాతుల్ హింద్‌కు చెందినవాడని ఐజీపీ తెలిపారు.


కుల్గాంలో..






దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో షిరాజ్ మోల్వీ, యావర్ భట్ అనే ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. వీరు హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందినవారిగా కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.



షిరాజ్ 2016 నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. అమాయకమైన యువకుల్ని ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేసుకుని ఎంతో మంది ప్రాణాలు బలితీసుకున్నాడు. షిరాజ్ మృతి మాకు ఓ పెద్ద విజయం.                                       -  కశ్మీర్ జోన్ పోలీస్     


Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి


Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?


Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి             

Published at: 12 Nov 2021 01:34 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.