ఓ భారతీయ క్రికెటర్ కుమార్తెకు ఆన్ లైన్ లో అత్యాచార బెదిరింపులు చేసిన వ్యక్తిని ముంబయి పోలీసులు.. హైదరాబాద్ లో అరెస్టు చేశారు. నిందితుడిని రామనాగేష్ అలీబతినిగా గుర్తించారు. టీ20 ప్రపంచకప్ 2021లో పాకిస్థాన్‌తో టీమిండియా ఓడిపోయిన తర్వాత భారత క్రికెటర్ విరాట్ కోహ్లి కుమార్తెపై ఆన్‌లైన్‌లో అత్యాచారం బెదిరింపులు చేశారు. చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ హెచ్చరించారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. అయితే, ఆ తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబయి సైబర్ సెల్ పోలీసులు విచారణ జరిపి ట్వీట్ చేసిన వ్యక్తిని గుర్తించారు. బుధవారం హైదరాబాద్ లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు రామనాగేష్ అలీబతిని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అంతకు ముందు ఓ ఫుడ్ డెలివరీ యాప్ కోసం పని చేసేవాడు.
పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఓటమిని సహించలేని కొందరు సామాజిక మాధ్యమాల్లో టీమ్ఇండియా క్రికెటర్లపై దారుణ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు.కొంత మంది గీత దాటి హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా క్రికెటర్ల భార్య, కుమార్తెలను కూడా అసభ్యంగా దూషించారు. క్రికెటర్ కుమార్తె చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు.
క్రికెటర్ కుమార్తెకు ఆన్‌లైన్ రేప్ బెదిరింపుల నివేదికలపై ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సుమోటోగా విచారణ చేపట్టింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌ను ఎఫ్‌ఐఆర్ కావాలని డీసీడబ్ల్యూ కోరింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేసిన వారి వివరాలను.. తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరణాత్మక నివేదికను తమకు అందించాలని చెప్పింది. ఈ మేరకు నోటీసును జారీ చేసింది. విరాట్ కోహ్లీ మరియు అతని కుటుంబాన్ని ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడాన్ని "తీవ్రమైన విషయం"గా డీసీడబ్ల్యూ అభివర్ణించింది..
Also Read: IPL Update: ఆర్‌సీబీ కోచింగ్ యూనిట్‌లో మార్పు.. కొత్త కోచ్‌గా భారత ఆటగాడే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి