వారం రోజుల్లో ఎయిడెడ్ విద్యా సంస్థల్ని చంపేస్తూ మీరు ఇచ్చిన జిఓ 42ని ఉపసంహరించుకోవాలని టీడీపీ నేత నారా లోకేష్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. అనంతపురంలో ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజీలో జరిగిన లాఠీచార్జిలో గాయపడిన విద్యార్థుల్ని లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించిన మాట్లాడిన లోకేష్... ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కోర్టుకి తప్పుడు అఫిడవిట్ లు సమర్పించడం... నిర్ణయం మార్చుకున్నామని లీకులు ఇవ్వడం కాదని.. వెంనటే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడికి ఆదేశాలిచ్చిన వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.


Also Read : పరిటాల - జేసీ ఆత్మీయ పలకరింపు..అనంతపురం టీడీపీ నేతలకు స్వీట్ షాక్ !


జగన్ రెడ్డిని మూర్ఖపు ముఖ్యమంత్రిగా తాను ఊరికే అనడం లేదని.. అనంతపురంలో ఎం జరిగిందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఓ మంత్రి దుండగులు పోలిస్ డ్రెస్ వేసుకొని విద్యార్థుల పై దాడి చేసారని అంటారని.. మరో మంత్రి అక్కడ పోలీసులే లేరు విద్యార్థులే కొట్టుకొని తలలు పగలగొట్టుకున్నారని అంటున్నారని.. వారిని ఇలాగే వదిలేస్తే అసలు అనంతపురంలో ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజ్ లేదు దాడి ఎప్పుడు జరిగింది అంటారని మండిపడ్డారు. అందుకే జగన్ రెడ్డి మూర్ఖపు ముఖ్యమంత్రి.. మంత్రులు కంత్రీలని మండిపడ్డారు. 1854 లోనే ఎయిడెడ్ వ్యవస్థ ఏర్పడిందని.. ఎన్టీఆర్ , వెంకయ్యనాయుడు , జస్టిస్ రమణ గారు, బలయోగి, చివరికి వైఎస్ కూడా ఎయిడెడ్ స్కూళ్లలోనే చదువుకుని పైకి వచ్చారని గుర్తు చేశారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎయిడెడ్‌ను ప్రైవేటుపరం చేస్తూ రత్నకుమారి కమిటీ ఇచ్చిన నివేదికపై లోకేష్ విమర్శలు చేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా ప్రభుత్వానికి కావాల్సింది రాసిచ్చారన్నారు.


Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?



మేనమామగా ఉంటానన్న జగన్ రెడ్డి కంసమామగా మారిపోయి.. విద్యార్థుల పై లాఠీఛార్జ్ చేయించే స్థాయికి జగన్ రెడ్డి దిగజారిపోయారని విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఎయిడెడ్ స్కూల్స్, కాలేజెస్ ని నాశనం చెయ్యొద్దు, నిర్ణయాన్ని మార్చుకోండి అని అడిగినందుకు విద్యార్థుల తలలు పగల గొట్టారన్నారు. జ‌గ‌న్‌రెడ్డి దోచుకోవ‌డానికి ఆంధ్రప్రదేశ్‌లో జ‌నం ర‌క్తం త‌ప్పించి ఏమీ మిగ‌ల్లేదు అందుకే ఎయిడెడ్ సంస్థలపై కన్నేశారని విమర్శించారు. విద్యార్థులపై పోలీసులు చేసిన దాడికి సీఎం విద్యార్థిలోకానికి క్షమాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశ్నించిన ప్రజలు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టారని ఇప్పుడు విద్యార్థుల వంతు వచ్చిందన్నారు. విద్యార్ధులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బకి జగన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం చెల్లించ‌క త‌ప్పదని హెచ్చరించారు.


Also Read : అనంత విద్యార్థులపై విరిగిన లాఠీ... ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత


ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసి వేయవద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల భూములు, విద్యా సంస్థల ఆస్తులు లాక్కుంటే పేదలు ఫీజుల  భారం మోయలేరన్నారు. ల‌క్షలాది పిల్లల చ‌దువు కంటే ఎయిడెడ్ సంస్థలకు వున్న లక్ష కోట్ల విలువైన భూములు, ఆస్తులే జ‌గ‌న్‌రెడ్డికి ముఖ్యమయ్యాయని మండిపడ్డారు. విద్యార్థుల ఉద్య‌మాన్ని తెలుగుదేశం పార్టీ ముందుండి న‌డిపిస్తుందని..లాఠీల‌తో వ‌స్తారో...లారీల‌తో వ‌స్తారో రావాలని లోకేష్ సవాల్ చేశారు. కాలేజీల‌ను కాపాడుకుందాం.. స్కూళ్ల‌ను ర‌క్షించుకుందామని పిలుపునిచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్లో విద్యార్థుల‌కు న్యాయం జ‌రిగేవ‌ర‌కూ ఈ ఉద్యమం అన్ స్టాపబుల్ అని స్పష్టం చేశారు.


Also Read : నెల్లూరులో కార్పొరేషన్‌ కోసం టీడీపీ విశ్వప్రయత్నాలు.. రంగంలోకి దిగ్గజాలు.. కానీ, కనిపించని కీలక నేత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి