అనంతపురం జిల్లాలో పరిటాల - జేసీ కుటుంబాల మధ్య ఉన్న  వైరం గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. అది రాజకీయ పరంగానే కాదు కుటుంబాల మధ్య వ్యక్తిగత ఫ్యాక్షన్ వైరం కూడా ఉండేది. అలాంటిది ఇప్పుడు వారు పాత గొడవలన్నీ మర్చిపోయి ఒక  పార్టీలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారు ఎక్కువగా కలసి, మెలిసి ఉంటున్నారు. నారా లోకేష్ అనంతపురం పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి నేతలంతా వచ్చినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి - పరిటాల శ్రీరామ్ ఆత్మీయ పలకరింపు అందర్నీ ఆకట్టుకుంది. 


Also Read : నెల్లూరులో కార్పొరేషన్‌ కోసం టీడీపీ విశ్వప్రయత్నాలు.. రంగంలోకి దిగ్గజాలు.. కానీ, కనిపించని కీలక నేత


హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నారా లోకేష్ అనంతపురం వెళ్లారు. ఆయనకు దారి పొడుగునా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతపురంలోకి ఎంటరయ్యే సమయంలో ఆ జిల్లాకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత పరిటాల శ్రీరామ్ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ఇద్దరూ ఎదురుపడిన సందర్భాలు లేవు. దీంతో  ఇద్దరు నేతల కార్యకర్తల మధ్య కాస్త టెన్షన్ వాతావరణ ఏర్పడింది. అయితే పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి హత్తుకోవడం.. పరిటాల శ్రీరామ్ కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడటంతో పరిస్థితి తేలికగా మారింది. 


Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


వీరిద్దరి ఆత్మీయ పలకరింపు అనంతపురం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అనంతపురం టీడీపీలో నేతల కంటే గ్రూపులు ఎక్కువ. అందరూ బలమైన నేతలే కావడంతో ఎవరికి వారు తమ తమ పెత్తనం ఉండాలనుకుంటారు. ఈ కారణంగా ఎప్పుడూ గ్రూపులు గొడవలు ఉంటూనే ఉంటాయి. టీడీపీలో ఉన్నప్పటికీ పరిటాల, జేసీ వర్గాల మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా పొసిగేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో మాత్రం మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. కలసి కట్టుగా అధికారపక్షంపై పోరాడేందుకు అన్నీ మర్చిపోతున్నారు. 


Also Read: Fuel Prices: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?


అనంతపురంలో కొన్నాళ్ల కిందట కొన్ని గ్రూపులు ఉండేవి. పరిటాల, కేతిరెడ్డి, జేసీ వర్గాలు రాజకీయంగానే కాదు.. ఫ్యాక్షన్ పరంగానూ పోరాటాలు చేసుకునేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది . ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగానే పోరాడుకుంటున్నారు. పరిటాల- జేసీ వర్గీయుల మధ్య విభేదాలు తగ్గిపోతే జిల్లాలో తమకు తిరుగు ఉండదని టీడీపీ కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు.


Also Read : హోరాహోరీగా ఏపీలో మినీ స్థానిక సమరం ! తాజా పరిస్థితి ఇదే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి