రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కోచ్‌గా సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. రెండేళ్ల కాలానికి అతడితో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. మైక్ హెసన్ నుంచి అతడు బాధ్యతలు స్వీకరించాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
'టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ఆర్‌సీబీ బ్యాటింగ్ సలహాదారు సంజయ్ బంగర్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఆర్‌సీబీ ప్రధాన కోచ్‌గా ఉంటారు. అభినందనలు కోచ్ సంజయ్! మీరు రాణించాలని కోరుకుంటున్నాం' అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. వెంటనే ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్.. బంగర్‌కు అభినందనలు తెలియజేశారు. 2022 సీజన్ వేలం, రాబోయే సీజన్లలో జట్టుకు సంబంధించిన ప్రణాళికలను బంగర్ షేర్ చేసుకున్నాడు.
ఐపీఎల్ 2021 సీజన్ తొలి దశలో సైమన్ కటిచ్ ఆర్‌సీబీ కోచ్‌గా పనిచేశాడు. వ్యక్తిగత కారణాలతో అతడు రెండో అంచెలో దుబాయ్‌కి రాలేదు. దాంతో ఆ బాధ్యతలను మైక్ హెసన్ తాత్కాలికంగా చేపట్టారు. తాజాగా బంగర్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. కోచింగ్ విభాగంలో అతడికి మంచి అనుభవమే ఉంది. ఈ సీజన్లో ఆర్‌సీబీకి అతడు బ్యాటింగ్ సలహాదారుగా పనిచేసిన సంగతి తెలిసిందే.
బంగర్ 2014 నుంచి టీమ్‌ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2019లో అతడి స్థానాన్ని విక్రమ్ రాఠోడ్ భర్తీ చేశాడు. అయితే ఐపీఎల్‌లో కోచ్‌గా అతడికి అనుభవం ఉంది. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సహాయ కోచ్‌గా పనిచేసిన అతడు అదే సీజన్లో కోచ్ ప్రమోషన్ పొందాడు. కానీ 2016లో పదవి నుంచి తప్పుకున్నాడు. టీమ్‌ఇండియా తరఫున బంగర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, దక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడు. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికేనాటికి 33 టీ20లు ఆడాడు.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి