పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి పోటీ చేయనున్నట్లు యాక్టర్ సోనూసూద్ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో ఆమె చేరుతున్నారనే దానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను ఇప్పటికే సోనూసూద్ ఖండిచారు. అయితే ఆయన సోదరి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల ఐటీ దాడులు..
పన్ను ఎగవేత ఆరోపణలపై సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో ఇటీవల ఐటీ శాఖ సోదాలు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయని చెప్పారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధంగా లేనందున వాటిని నిరాకరించినట్లు ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా బహిరంగంగా వెల్లడిస్తానని సోనూసూద్ స్పష్టం చేశారు.
ఐటీశాఖ దాడులపై స్పందిస్తూ.. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు.
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల లక్షల మంది వలస కూలీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సొంతూళ్లకు వెళ్లేందుకు పిల్లా, బిడ్డల్ని తీసుకుని వేల కిలోమీటర్లు నడుచుకుని వెళ్లారు. అలాంటి సమయంలో కొన్ని వందల మంది వలసకూలీలను సొంతూళ్లకు చేర్చారు సోనూసూద్. తన సొంత ఖర్చులతో ఎంతో సేవ చేశారు. రియల్ హీరోగా అభిమానుల మనుసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు.
Also read: ABP-CVoter Survey: యూపీ భాజపాకే.. కానీ 100 సీట్లు హాంఫట్.. పంజాబ్‌లో ఒకటి కూడా కష్టమే!
Also read: తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?
Also read: గోల్డెన్ అవర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...
Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి