NBK's Unstoppable: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని

'అన్‌స్టాప‌బుల్‌' సెకండ్ ఎపిసోడ్‌కు నాని అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఓ చిన్నారిని కార్యక్రమానికి తీసుకొచ్చి హోస్ట్ బాలకృష్ణను ఆయన స‌ర్‌ప్రైజ్ చేశారు. ఆ అమ్మాయి ఎవరు? ఏంటి? ఇదిగో వివరాలు...

Continues below advertisement

'అన్‌స్టాప‌బుల్‌' తొలి ఎపిసోడ్‌కు మోహన్ బాబుతో పాటు ఆయన పిల్లలు లక్ష్మీ మంచు, విష్ణు మంచు వచ్చారు. వారితో బాలకృష్ణకు ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉంది. అది ఎపిసోడ్‌లో కనిపించింది. చాలా సరదాగా చేశారు. యువ హీరోలతో బాలకృష్ణ ఎలా ఉంటారో అనే సందేహాలకు, ప్రశ్నలకు 'అన్‌స్టాప‌బుల్‌' రెండో ఎపిసోడ్ సమాధానం ఇచ్చింది. నానితో బాలకృష్ణ చాలా సరదాగా ముచ్చటించారు. నానితో క్రికెట్ ఆడారు. జోకులు వేశారు. నవ్వించారు. అయితే... ఈ ఎపిసోడ్‌లో ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా చోటు చేసుకుంది.

హీరోగానే కాదు... సమాజసేవలోనూ బాలకృష్ణ ముందు ఉంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందిస్తారు. బసవరతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు. బాలకృష్ణ కాపాడిన ఓ ప్రాణాన్ని... 'అన్‌స్టాప‌బుల్‌' షోలో బాలకృష్ణ ముందుకు తీసుకొచ్చారు నాని. చిన్నారి చూసిన వెంటనే బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. ఆమెను దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దాడారు.

బాలకృష్ణ కాపాడిన ఆ ప్రాణం పేరు పేరు వినీలాంబిక. ఆ చిన్నారిది పదవర్లపూడి. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాను. జూన్ 2, 2011లో జన్మించింది. పుట్టిన రెండు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రికి తీసుకువెళితే... కడుపులో ఓ గడ్డ ఉందని, క్యాన్సర్ అని తెలిసింది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకువెళ్లినా చిన్నారికి చికిత్స అందించే ధైర్యం ఎవరూ చేయలేదని ఆమె తల్లి తెలిపారు. అప్పుడు విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహనరావు ద్వారా బసవతారకం ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్య శ్రీ రాకపోయినా బాలకృష్ణగారు దగ్గరుండి పాపకు కీమో థెరపీ చేయించారని, ఈ రోజు మా పాప ఇంత హ్యాపీగా ఉందంటే బాలయ్య బాబుగారే కారణమని, ఆయనకు జీవితాంతం మా కుటుంబమంతా రుణపడి ఉంటామని వినీలాంబిక తల్లి తెలిపారు.

'తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కనపడరు. బసవతారకంలో మీరు (బాలకృష్ణ) కనపడతారు" అని వెనీలాంబిక తల్లి అన్నారు. చిన్నారికి నాని ఒక ల్యాప్ టాప్ గిఫ్ట్ ఇచ్చారు. "బసవతారకం ఆస్పత్రిని తానెప్పుడూ ఆస్పత్రి అనను. అది దేవాలయం" అని బాలకృష్ణ అన్నారు. ఈ ఎపిసోడ్ చూశాక సేవలోనూ బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌' అని ప్రేక్షకులు అంటున్నారు.

Continues below advertisement



Also Read: పవన్ కల్యాణ్ చూశారు... ప్రశంసించారు! సంతోషంలో సినిమాటోగ్రాఫర్
Also Read: బంపర్ మెజారిటీ మీద కన్నేసిన నితిన్... వచ్చే ఏడాది వేసవిలో ప్రజల ముందుకు!
Also Read: 'రాజా విక్రమార్క' సమీక్ష: రాజావారి వేట బావుంది
Also Read: పుష్పక విమానం సమీక్ష: ఈ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిందా?
Also Read: స్పెషల్ ఆప్స్ 1.5 సమీక్ష: హాట్‌స్టార్ నుంచి అదరగొట్టే వెబ్ సిరీస్.. తెలుగులో కూడా!
Also Read: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also Read: 'రాధేశ్యామ్' ఫస్ట్ సాంగ్ కి ముహూర్తం ఫిక్స్ అయిందా..?
Also Read: ఐదు పదులు దాటినా కెవ్వు కేక.. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటున్న మలైకా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Continues below advertisement