పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మరో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకనిర్మాతలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా యువి క్రియేషన్స్ సంస్థను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా 'రాధేశ్యామ్' టీమ్ ఓ టీజర్ ని విడుదల చేసింది. అది బాగా ట్రెండ్ అయింది. 

 


 

అయితే ఇప్పటివరకు సినిమాలో ఒక్క పాట కూడా బయటకు రాలేదు. ఈ విషయంలో టీమ్ కూడా ఎలాంటి హడావిడి చేయడం లేదు. మరోపక్క జనవరి 7న రాబోతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్ తో రచ్చ చేస్తోంది. పాటలు, ప్రోమోలు అంటూ ట్విట్టర్ లో తెగ హంగామా చేస్తోంది. కానీ 'రాధేశ్యామ్' మాత్రం ఈ విషయంలో బాగా వెనుకబడింది. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అవుతున్నట్లు ఉన్నారు. ట్విట్టర్ లో నేరుగా దర్శకనిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా ఓ ఫ్యాన్ అయితే 'రాధేశ్యామ్' అప్డేట్స్ ఇవ్వడం లేదని.. సూసైడ్ లెటర్ కూడా రాశాడు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అంటూ రాసిన ఆ లెటర్ బాగా వైరల్ అయింది. 

 

నిజానికి ప్రభాస్ సినిమా అంటే జనాలు ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారు. కానీ కనీసం ప్రమోషన్స్ అనేవి లేకపోతే కష్టమే. పైగా 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాతో పోటీ అంటే ఎలా ఉండాలి..? కానీ 'రాధేశ్యామ్' టీమ్ మాత్రం బాగా లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారట. నవంబర్ 15న విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి నిజంగానే రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఇక పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

 



Also Read: మంచి జరుగుతూనే ఉంటుంది గుర్తుంచుకోండి .. సామ్ పోస్ట్ వైరల్


Also Read: ఆ ఇద్దరి డ్యాన్స్ 0.5X స్పీడులా అనిపిస్తుంది... మెచ్చుకున్న యూట్యూబ్ ఇండియా


Also Read: ఎన్టీఆర్, చరణ్ చిందేశారు... ఆల్రెడీ ఓ రికార్డు కొల్లగొట్టారు!


Also Read: టికెట్ ధరలు పెంచుతారా? లేదా? ఏపీ ఆన్‌లైన్ టికెట్ల‌ విధానంలో స్పష్టత వచ్చిందా? లేదా!?


Also Read: ఫన్ అండ్ సెంటిమెంట్ 'సౌండ్' స్టార్ట్ అయ్యింది... ఇది మల్టీబ్రాండ్ గురూ!


Also Read: 2014లో స్వాతంత్ర్యం అంతకు ముందుది భిక్షే.. కంగనా రనౌత్ వ్యాఖ్యలతో దుమారం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి