'సౌండ్'... ఈ టైటిల్‌తో నేడు (గురువారం) ఓ చిన్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. 'మల్టీ బ్రాండ్'... అనేది ఉపశీర్షిక. అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా నటిస్తున్న చిత్రమిది. కె.వి. చౌదరి దర్శకుడు. కె. రవీంద్ర నిర్మాత. పూజ తర్వాత ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌'తో నిర్మాతగా పరిచయమైన వాసు వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... మరో దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు క్లాప్ ఇచ్చారు. దర్శక - నిర్మాతలకు నిర్మాత అచ్చిరెడ్డి స్క్రిప్ట్ అందించారు.

"మాది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. కుటుంబంతో కలిసి చూసేలా సినిమా ఉంటుంది. మన జీవితాల్లో 'సౌండ్' అనేది చాలా సాధారణంగా ఉపయోగించే పదం అయ్యింది. క్యాచీగా ఉంటుందని అదే టైటిల్ కింద పెట్టాం. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్ సిటీలో ఓ షెడ్యూల్, విశాఖలో మరో షెడ్యూల్... రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేస్తాం" అని దర్శకుడు కె.వి. చౌదరి తెలిపారు.

"నిర్మాతగా మా తొలి చిత్రమిది. శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) బ్యానర్ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు అచ్చిరెడ్డి, భీమనేని శ్రీనివాసరావు, వాసు వర్మకు కృతజ్ఞతలు. సినిమాకు వస్తే... ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో సెంటిమెంట్ కూడా ఉంటుంది" అని నిర్మాత కె. రవీంద్ర తెలిపారు. "టైటిల్‌కు త‌గ్గ‌ట్టు సినిమా ఉంటుంది" అని హీరో అర్జున్ అన్నారు. జీవ, కళ్యాణ్ తేజ తదితరులు నటించనున్న ఈ సినిమాకు పవన్ గుండుకు సినిమాటోగ్రాఫర్, కపిల్ కుమార్ సంగీత దర్శకుడు. వనమాలి సాహిత్యం అందించనున్నారు.

Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రెడీ... టీజర్ విడుదల ఎప్పుడంటే?
Also Read: సంతాపమా... ప్రచారమా? ఏంటిది తలైవా?? ర‌జ‌నీకాంత్‌పై నెటిజ‌న్స్ ఫైర్‌
Also Read: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
Also Read: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి