పద్మశ్రీ అవార్డును అందుకున్న రెండు రోజుల్లోనే హీరోయిన్ కంగనా రనౌత్ దేశాన్ని దారుణంగా కించ పరిచారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 9వ తేదీన ఓ టీవీ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చిన కంగనా రనౌత్ " 1947లో స్వాతంత్ర్యం రాలేదు అది బిక్షమాత్రమే. కాంగ్రెస్ హయాంలో బ్రిటీష్ పాలన కొనసాగిందనీ, 2014లో దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది" అని వ్యాఖ్యానించారు. 2014లో నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఆమె స్వాతంత్ర్యంగా చెప్పారు. కంగనా ఇంటర్యూలోని ఈ క్లిప్ శరవేగంగా వైరల్ అయింది.
Also Read : ఎంపీలకు ఏటా రూ. ఐదు కోట్లు.. మళ్లీ స్కీమ్ ప్రారంభించిన కేంద్రం !
బీజేపీ ఎంపీ అయిన వరుణ్ గాంధీ కంగనపై విరుచుకుపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారిని అవమానించడం దారుణం అని మండిపడ్డారు. పిచ్చా లేక దేశద్రోహమా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నిన్న మొన్నటిదాకా జాతిపిత మహాత్మాగాంధీ త్యాగాలను అవమానించడమే కాకుండా, గాంధీజీని హత్యచేసిన గాడ్సేను పొగిడారు. ఇపుడు స్వాతంత్ర్య సమరయోధులు మంగళ్ పాండే, రాణి లక్ష్మీభాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది మంది వీరులను అగౌరవ పర్చారని వరుణ్ గాంధీ మండిపడ్డారు.
Also Read : ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
కంగనా మాటలు సహజంగానే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాజకీయంగా తమకు ఇష్టమైన వారిని పొగుడుకోవచ్చు కానీ ఇలా దేశానికి స్వాతంత్ర్యం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహనీయుల్ని కించ పరచడం సరి కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కంగనాపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
Also Read : హిందుత్వను ఐసిస్&బోకో హరామ్‌తో పోల్చిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఖుర్షీద్
దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటి అయిన పద్మశ్రీని కంగనా రనౌత్ రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు రోజుల కిందటే అందుకున్నారు. ఆ తర్వాత ఇచ్చిన టీవీ ఇంటర్యూల్లోనే ఆమె దేశాన్ని కించ పరిచారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన వ్యాఖ్యలపై ఇంత వరకూ కంగనా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై ఇంకా స్పందించలేదు. అయితే కంగనా రనౌత్ హార్డ్ కోర్‌గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరింత ఘాటుగా తన మాటలను ఆమె సమర్థించుకుని విమర్శలపై విరుచుకుపడతారని భావిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి