MP Lads Again : ఎంపీలకు ఏటా రూ. ఐదు కోట్లు.. మళ్లీ స్కీమ్ ప్రారంభించిన కేంద్రం !

ఎంపీ ల్యాడ్స్ స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఏటా రూ. ఐదు కోట్లు ఎంపీలకు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తారు.

Continues below advertisement

కరోనా లాక్ డౌన్ కారణంగా ఎంపీలకు నిలిపేసిన నియోజకవర్గ ‌అభివృద్ది నిధులను మళ్లీ మంజూరు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రెండేళ్ల పాటు నిలిపివేయాలని గతలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించారు. ఎంపీలందరికీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తున్నారు. వీటిని ఎంపీ ల్యాడ్స్‌గా పేర్కొంటారు. సహజంగా ఏటా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నారు. ఉభయసభల ఎంపీలకు ఇవి వచ్చేవి. వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని ఖర్చు చేయవచ్చు.  

Continues below advertisement

Also Read : ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?

కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ సమయంలో ఎంపీల వేతనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధులు కత్తిరించారు. అలా మిగులుతున్న నిధులన్నీ కరోనాపై పోరు కోసం సిద్ధం చేస్తున్న కన్సాలిడేటెడ్ ఫండ్‌కు మళ్లించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ రావడం.. వ్యాక్సినేషన్ కూడా  వంద కోట్ల మందికి పూర్తవడంతో ఇప్పుడు మళ్లీ నిధఉలు కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన కాలానికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై ఎంపీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి 2 కోట్ల రూపాయల చొప్పున ఎంపీ ల్యాడ్స్‌ కింద ఏకమొత్తంలో నిధులు అందనున్నాయి.  2026 వరకు ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అప్పటి వరకూ ఏటా రూ. ఐదు కోట్లు కేటాయిస్తారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి వీటిని వినియోగించుకోవచ్చు. నియోజకవర్గాల్లో ప్రజలు ఎంపీలకు తమ తమ గ్రామాల్లో, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విజ్ఞప్తులు చేస్తూంటారు. 

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

వాటిని ఇతర పథకాల కింద నిర్మించడానికి చాలా సమయం పడుతుంది ఇలాంటి చోట్ల ఈ ఎంపీ ల్యాడ్స్ ఉపయోగపడతాయి. ఇప్పటి వరకూ ఎంపీలు నిధుల కేటాయింపు లేకపోవడంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇక ముందు తమకు వచ్చే విజ్ఞప్తులకు నిధులు మంజూరు చేసే అవకాశం ఏర్పడింది. 

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement