కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ నష్టపోయినా కొన్నింట్లో మాత్రం మేలు జరిగింది! డిజిటలైజేషన్ ఎన్నో రెట్లు మెరుగైంది. బీమా రంగంలోనూ ఈ మార్పులు కనిపించాయి. దాంతో ఆన్‌లైన్ బీమా పాలసీల విక్రయాలు పెరిగిపోయాయి. కొన్ని రకాల లాభాలు ఉండటం, బయటకు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ప్రజలూ వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రత్యేక ఆన్‌లైన్ బీమాల వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం!!
బీమా కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్ అత్యుత్తమ విధానంగా మారిపోయింది. ఇంటి దగ్గర్నుంచే సులభంగా కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్ బీమా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రయోజనాలు ఇవే
* ఆన్‌లైన్ బీమా పాలసీల ఖర్చు తక్కువ! మధ్యవర్తులు ఉండరు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కమీషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
* ఆన్‌లైన్‌లోనే తీసుకుంటారు కాబట్టి కస్టమర్ తమకు అవసరమైన బీమాలను సులభంగా పోల్చి చూసుకోవచ్చు. అనువైనది ఎంచుకోవచ్చు.
* ఆన్‌లైన్ పాలసీలల్లో ఎక్కువ డాక్యుమెంటేషన్ ఉండదు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే తక్కువ పేపర్ వర్కే ఉంటుంది.
సంపూర్ణ సురక్ష
సంపూర్ణ సురక్ష బీమాను ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. ఇది గ్రూప్, నాన్ లింకుడ్, నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ. స్టాక్‌మార్కెట్‌తో సంబంధం ఉండదు. ఫార్మల్, ఇన్‌ఫార్మల్ గ్రూపులకు వర్తిస్తుంది. ఏటా రెనివల్ చేసుకోవాలి. ఎస్‌బీఐ యూనో యాప్ ద్వారా పది మంది సభ్యులున్న గ్రూపు ఈ పాలసీ తీసుకోవచ్చు.
* ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 16. గరిష్ఠ వయసు 79. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 80 ఏళ్లు.
* ఒక సభ్యుడికి కనీస బీమా మొత్తం రూ.1000. గరిష్ఠంగా రూ.50 కోట్ల వరకు తీసుకోవచ్చు.
* ఏటా పాలసీ రెనివల్ చేసుకోవాలి. నెల, మూడు నెలలు, ఆర్నెల్లు, సంవత్సరానికి ప్రీమియం చెల్లించొచ్చు.
* పాలసీ దారుల్లో ఎవరైనా కన్నుమూస్తే నామినీకి బీమా మొత్తం చెల్లిస్తారు. ప్రీమియం చెల్లింపులపై పన్ను వర్తించదు.
ఎల్‌ఐసీ టెక్ టర్మ్
దేశంలో మొదటి ఆన్‌లైన్ టర్మ్ పాలసీ ఇదే! ఎల్‌ఐసీ టెక్ టర్మ్ నాన్ లింకుడ్, లాభరహిత, రక్షణ పాలసీ. అంటే స్టాక్ మార్కెట్‌తో సంబంధం లేదు. ఎల్‌ఐసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా తీసుకోవచ్చు.
* ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18. గరిష్ఠ వయసు 65. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 80 ఏళ్లు.
* కనీస బీమా మొత్తం రూ.50 లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు.
* పాలసీ టర్ములు 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటాయి.
* పాలసీదారు మరణిస్తే నామినీకి ఏకమొత్తంలో బీమా డబ్బులు వస్తాయి.
* ఈ ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?