దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పేటీఎం పబ్లిక్ ఇష్యూ ప్రక్రియ మొదలైంది. సోమవారం సబ్‌స్క్రిప్షన్లు మొదలయ్యాయి. రూ.18,300 కోట్లతో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకు వస్తోంది. 2010లో కోల్‌ఇండియా (రూ.15,200) తర్వాత ఇదే అతిపెద్ద ఐపీవో కావడం గమనార్హం. గతవారం ఐదు కంపెనీలు విజయవంతంగా నమోదైన తర్వాత పేటీఎం ఇష్యూ మొదలైంది.
Paytm IPO: ధరలు ఏంటి?
మూడు రోజుల పాటు ప్రజలు సబ్‌స్క్రిప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ధర రూ.2080-2150 మధ్యన నిర్ణయించారు. పబ్లిక్ ఇష్యూకు వచ్చే ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ.8,235 కోట్లను సమీకరించింది. మూడు రోజుల పేటీఎం ఐపీవో నవంబర్ 10న ముగుస్తుంది. 15న కేటాయింపు పూర్తి అవుతుంది. నవంబర్ 18న నమోదు అవుతుందని అంచనా.
Paytm IPO: బిడ్ ఎలా వేయాలి?
పేటీఎం పబ్లిక్ ఇష్యూపై ఆసక్తిగల వారు కనీసం ఆరు షేర్లతో కూడిన లాట్‌ను కొనుగోలు చేయాలి. మరో ఆరు పెంచుకుంటూ ఎన్ని షేర్లైనా తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.12,480.
Paytm IPO issue విలువ ఎంత?
పేటీఎం తాజా ఇష్యూలో రూ.8,300 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. రూ.10,000 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఇప్పటికే ఉన్న షేర్ హోల్డర్లకు ఇస్తున్నారు.
Paytmలో వాటాలు ఎవరు విక్రయిస్తున్నారు?
పేటీఎంలోని అతిపెద్ద ఇన్వెస్టర్ యాంట్ ఫైనాన్షియల్ 27.9 శాతం వాటాను విక్రయిస్తోంది. దీని విలువ 643 మిలియన్ డాలర్లు. పేటీఎం ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ రూ.402.65 కోట్ల విలువైన షేర్లను అమ్ముతున్నారు.
మీరు Paytm సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చా?
ప్రస్తుతం గ్రే మార్కెట్లో పేటీఎం షేర్ల ప్రీమియం కాస్త తగ్గింది. సోమవారం జీఎంపీ రూ.62గా ఉంది. కంపెనీ విలువ కాస్త ఖరీదు ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే మొబైల్, డిజిటల్ చెల్లింపుల్లో పేటీఎం అగ్రగామి కావడంతో సుదీర్ఘ కాలంలో బాగుంటుందని అంచనా వేస్తున్నారు. 2016లో నోట్ల రద్దు తర్వాత పేటీఎం భారీ వృద్ధి నమోదు చేసింది. ఇప్పుడు బీమా, బంగారం, సినిమా టికెట్లు, విమానాల టికెట్లు, బ్యాంకు డిపాజిట్ల సేవలను అందిస్తోంది.
Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు
Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?