సురక్షితమైన పెట్టుబడి సాధనాల గురించి ఆలోచిస్తే మొదటిగా తట్టే ఆలోచన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. కానీ ఇప్పుడేమో డిపాజిట్లపై వడ్డీని తక్కువగా ఇస్తున్నారు. రానురాను వడ్డీరేట్లు  మరింత తగ్గిపోయే సూచనలు ఉండటంతో చిన్న పొదుపు పథకాల్లో డబ్బు దాచుకొనేవారు ఆందోళన పడుతున్నారు.


ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లపై తక్కువ వడ్డీరేట్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే కొన్ని బ్యాంకులు 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు పోటీదారుల కన్నా ఎక్కువ వడ్డీరేటును వర్తింప జేస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితో కూడిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఈ డిపాజిట్లపై డీఐసీజీసీ బీమా ఉండటంతో భద్రతకు ఢోకా లేదు.


ప్రైవేటు రంగ బ్యాంకుల్లో యెస్‌ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అందరికన్నా ఎక్కువ వడ్డీని ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ ఇస్తోంది. ఇక ఆర్‌బీఎల్‌ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. మూడేళ్ల డిపాజిట్లపై 6.8 శాతం వరకు వడ్డీరేటును అమలు చేస్తోంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంకూ 6.50 శాతం వడ్డీని అందిస్తోంది. డీసీబీ బ్యాంకు కూడా ఫర్వాలేదు. మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.45 శాతం వడ్డీ ఇస్తోంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌ సైతం 6.25 శాతం వడ్డీని అందిస్తోంది.


మరోవైపు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 5.80 శాతం వడ్డీ రేటు ఇస్తున్నాయి.


Also Read: Cheapest car loan: కార్‌ కొంటారా? ఇంత కన్నా తక్కువ వడ్డీకి ఎవరూ లోన్‌ ఇవ్వరు..! కొన్ని రోజులే ఛాన్స్..!


Also Read: Provident Funds: ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?


Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్‌ తెచ్చిన ఐటీ శాఖ


Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి


Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్


Also Read: RIL Official Statement: అంబానీ ఫ్యామిలీ లండన్‌కు షిప్టు అయిపోతుందా.. లండన్‌లో ప్యాలెస్ ఎందుకు కొన్నట్టు.. దీనిపై రిలయన్స్‌ రియాక్షన్ ఏంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి