పండగల సీజన్‌, మంచి రోజులు కావడంతో వినియోగదారులు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాహన కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. ఇష్టమైన వాహనం సొంతం చేసుకొనేందుకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే ఆన్‌రోడ్‌ ధరపై 90 శాతం వరకు రుణం మంజూరు చేస్తున్నాయి.


పంజాబ్‌, సింధ్‌ బ్యాంక్‌: ప్రస్తుతం ఈ బ్యాంకు అందరికన్నా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తోంది. 6.80 శాతం వడ్డీకే వాహన రుణాలు ఇస్తోంది. 2021, నవంబర్‌ 10 వరకు ప్రాసెసింగ్‌ ఫీజూ తీసుకోవడం లేదు. ఐదేళ్ల కాలపరిమితితో రూ.లక్ష రుణానికి నెలకు రూ.1971 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఈ బ్యాంకు 6.85 శాతం వడ్డీరేటుకే రుణాలు మంజూరు చేస్తోంది. డిసెంబర్‌ 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజూ లేదు. లక్ష రూపాయాల రుణానికి నెలకు రూ.1973 ఈఎంఐ చెల్లించాలి.


ఇండియన్‌ బ్యాంక్‌: 6.90 శాతం వడ్డీ రేటును ఇండియన్‌ బ్యాంకు వర్తింపజేస్తోంది. లక్ష రూపాయాల రుణానికి ఐదేళ్ల కాలపరిమితికి నెలకు రూ.1975 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఈ బ్యాంకు కార్‌ లోన్‌ను 7శాతం వడ్డీరేటుకే మంజూరు చేస్తోంది. కస్టమర్‌ లక్ష రూపాయాల రుణాన్ని ఐదేళ్ల కాలపరిమితితో తీసుకుంటే రూ.1980 వరకు ఈఎంఐ చెల్లించాలి.


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: ఈ బ్యాంకు ఆటో లోన్స్‌ను 7.05 శాతం వడ్డీరేటుకు అందిస్తోంది. రూ.లక్ష రుణం, ఐదేళ్ల కాల పరిమితికి ఈఎంఐ రూ.1982 వరకు ఉంది.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఎస్‌బీఐ 7.25 శాతం వడ్డీకి వాహన రుణం మంజూరు చేస్తోంది. ఐదేళ్ల కాలపరిమితో లక్ష రూపాయాల రుణానికి ఈఎంఐ 1992 వరకు ఉంటుంది.


యూనియన్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా: యూబీఐ కూడా ఎస్‌బీఐ తరహాలోనే 7.25 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది. రూ.1992 ఈఎంఐగా ఉంటుంది.


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఈ బ్యాంకు ఐదేళ్ల కాలపరిమితితో రూ.లక్ష వాహన రుణానికి 7.25 శాతం వడ్డీని వేస్తోంది. రూ.1992 ఈఎంఐ.


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్: పీఎన్‌బీ 7.30 శాతం వడ్డీరేటుకు రుణాలు ఇస్తోంది. లక్ష రూపాయాల రుణానికి నెలకు రూ.1994 ఈఎంఐ చెల్లించాలి.


Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్‌ తెచ్చిన ఐటీ శాఖ


Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి


Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!


Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి