పన్నులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకొనేలా పన్ను చెల్లింపు దారులకు సాయం చేసేందుకు ఆదాయపన్ను శాఖ సరికొత్తగా వార్షిక సమాచార పత్రం (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌) తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌లో దీనిని విడుదల చేసింది. ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వగలిగే సౌకర్యం ఇందులో ఉంది.


ఏంటి ఈ ఏఐఎస్‌?
వార్షిక సమాచార పత్రాన్ని సులభంగా ఏఐఎస్‌ అంటున్నారు. వడ్డీ, డివిడెండ్‌, సెక్యూరిటీ లావాదేవాలు, మ్యూచువల్‌ ఫండ్ల లావాదేవీలు, విదేశాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలను ఇందులో చూడొచ్చు. ఈ ఏఐఎస్‌ స్టేట్‌మెంట్లో సరళీకరించిన పన్ను చెల్లింపుదారు సమాచార సారాంశం (టాక్స్‌పేయర్‌ ఇన్ఫర్మేషన్‌ సమ్మరీ) సైతం ఉంటుంది. సులభంగా రిటర్నులు సమర్పించేందుకు టాక్స్‌పేయర్‌ మొత్తం విలువను తెలుసుకోవచ్చు.


ఫామ్‌26 కూడా అందుబాటులోనే
కొత్త ఏఐఎస్‌ స్టేట్‌మెంట్‌ పూర్తిగా అమల్లోకి వచ్చేవరకు ఫామ్‌26 ఏఎస్‌ కూడా TRACES పోర్టల్లో అందుబాటులో ఉంటుంది. ఏఐఎస్‌లో ఫీడ్‌బ్యాక్‌ సబ్‌మిట్‌ చేయగానే రియల్‌టైమ్‌లో ఆటోమేటిక్‌గా టీఐఎస్‌ (సమ్మరీ) అప్‌డేట్‌ అవుతుంది. దీనిని ప్రీ ఫైలింగ్‌ రిటర్న్‌కూ ఉపయోగించుకోవచ్చు. ఇది దశల వారీగా అమల్లోకి వస్తుంది.


ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?
* మీ పాన్‌ లేదా ఆధార్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో (https://eportal.incometax.gov.in/iec/foservices/#/login) లాగిన్‌ అవ్వాలి.
* టాప్‌మెనూలో సర్వీసెస్‌ సెక్షన్‌కు వెళ్లి యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌ను క్లిక్‌ చేయాలి.
* ఆ తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయాలి. ఏఐఎస్‌ ట్యాబ్‌పై డౌన్‌లోడ్‌ బటన్‌ను  క్లిక్‌ చేయాలి.
* పీడీఎఫ్‌ లేదా జేఎస్‌ఓఎన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* ఏఐఎస్‌ ఫామ్‌కు పాస్‌వర్డ్‌ ఉంటుంది. అది మీ పాన్‌, పుట్టినతేదీతో ఉంటుంది. ఉదాహరణకు మీ పాన్‌ ABCDE1234F, పుట్టినతేదీ 01-01-1978 అయితే మీ పాస్‌వర్డ్‌ ABCDE1234F01011978 అవుతుంది.
* పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయగానే ఏఐఎస్‌ ఫామ్‌లోని వివరాలన్నీ కనిపిస్తాయి. మీ సమాచారంపై ఎలాంటి ఇబ్బందులు, అనుమానాలు ఉన్నా ఆన్‌లైన్‌లో వెంటనే ఫీడ్‌బ్యాక్‌ 






Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి


Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!


Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!


Also Read: Gold-Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అంతే.. నేటి ధరలివీ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి