భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) కస్టమర్ల  కోసం అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లను అమలు చేస్తోంది. సురక్షితం, లాభదాయకం కావడంతో ప్రజలు ఎక్కువగా ఎల్‌ఐసీలోనే పాలసీలు తీసుకుంటున్నారు. పైగా పన్ను మినహాయింపులూ ఉంటున్నాయి.


ప్రస్తుతం ఎల్‌ఐసీ జీవన్‌ లాభ్‌ పాలసీపై ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పాలసీలో నెలకు రూ.233 ప్రీమియంగా చెల్లిస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.17లక్షలు చేతికి అందుతాయి! పైగా ఇది నాన్‌ లింక్డ్‌ 936 స్కీమ్‌. అంటే స్టాక్‌మార్కెట్‌తో సంబంధం ఉండదు.


జీవన లాభ్‌ పాలసీ సురక్షితమైన రాబడి అందిస్తోంది. ఎనిమిదేళ్ల వయసులోనే ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్ఠ వయసు 59 ఏళ్లు. ఇక పాలసీ టర్మ్‌ను 16-25 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు. స్కీమ్‌లోని కనీస మొత్తం రూ.2 లక్షలు. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. మూడేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత రుణం తీసుకొనేందుకు అవకాశం ఉంది. పైగా పన్ను మినహాయింపులూ ఉన్నాయి.


పాలసీదారు మరణిస్తే నామినీకి లేదా టర్మ్‌ ముగిస్తే సమ్‌ అష్యూర్‌మొత్తంతో పాటు రివర్షనరీ బోనస్‌, ఫైనల్‌ అడిషన్‌ బోనస్‌ ఇస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 25 ఏళ్ల టర్మ్‌తో జీవన్‌ లాభ్‌ తీసుకున్నాడని అనుకుందాం. మొత్తం ప్రీమియం చెల్లించాడని భావిద్దాం.


సమ్‌ అష్యూర్డ్‌ రూ.200,000.
చెల్లించిన ప్రీమియం - రూ.1,55,328
సింపుల్‌ రివర్షనరీ బోనస్‌: 15 ఏళ్లకు వెయ్యికి రూ.40 ఇస్తారు. అంటే 40 x 200 x 25= రూ.200,000
ఫైనల్‌ అడిషన్‌ బోనస్‌: వెయ్యికి రూ.20 అంటే 20 x 200 = రూ.4000 (ఇది కంపెనీ ప్రకటిస్తుంది)
పాలసీదారుడికి అందే మొత్తం = రూ.200,000 + రూ.200,000 + రూ.4000= రూ.4,04,000


నోట్‌: మీరు ఎక్కువ సమ్‌ అష్యూర్డ్‌ ఎంచుకుంటే రూ.17లక్షల వరకు పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా రైడర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రీమియం వేవియర్‌ బెన్‌ఫిట్‌నూ ఎంచుకోవచ్చు.


Also Read: Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!


Also Read: Saving Accounts Interest Rates: సేవింగ్స్‌ ఖాతాలపై 7 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు


Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి