ఇంటి ఖర్చులకు పోను మిగిలిన నగదును బ్యాంకుల్లో దాచుకోవడం అందరూ చేసే పనే! సేవింగ్స్ అకౌంట్లో జమ చేసిన సొమ్ముకు ఎంతోకొంత వడ్డీని ఆశిస్తారు. అయితే రానురానూ జాతీయ బ్యాంకుల్లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీరేట్లు తగ్గిపోతున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులూ 2.5 నుంచి 3.5 శాతం మధ్యలోనే వడ్డీ ఇస్తున్నాయి. కానీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై అనూహ్యంగా 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయాల వరకు ఉజ్జీవన్ బ్యాంకు 4 శాతం వడ్డీ అందిస్తోంది. ఒకవేళ లక్షకు మించి 25 లక్షల రూపాయాలు జమ చేస్తే ఏకంగా 7 శాతం వడ్డీ జమచేస్తోంది. 2021, మార్చి 6 నుంచి ఈ వడ్డీరేటును అమలు చేస్తోంది. వాణిజ్య, జాతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అన్నిటిలోనూ ఇదే అత్యధిక వడ్డీ కావడం ప్రత్యేకం.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సేవింగ్స్ ఖాతాలపై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3.50 శాతం నుంచి గరిష్ఠంగా 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ.25 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు నగదు జమ చేస్తే ఏడు శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. అయితే నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.2500 నుంచి రూ.5000 వరకు ఉండాలి. లక్ష నుంచి కోటి రూపాయాల వరకు ఏడు శాతం వడ్డీని వర్తింపజేస్తున్నారు.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకు కూడా 3.75 నుంచి 7 శాతం వరకు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీని ఇస్తున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల మధ్యన బ్యాలన్స్ ఉంటే ఏడు శాతం వడ్డీ ఇస్తున్నారు. 2021, అక్టోబర్ 1 నుంచి వడ్డీరేటును అమలు చేస్తున్నారు.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2021, జులై 1 నుంచి ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7 శాతం వరకు వడ్డీరేటును అమలు చేస్తోంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయాల నుంచి రూ.50 లక్షల పైన ఉండాలి.
Also Read: Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్.. ఇకపై ‘మెటా’.. ఎందుకంటే?
Also Read: Loan on Credit Card: క్రెడిట్ కార్డుపై రుణమా.. యమ డేంజర్! ఈ విషయాలు తెలుసుకున్నాకే తీసుకోండి!
Also Read: Nykaa IPO Subscription: నైకా ఐపీఓ ఆరంభం.. షేర్ల ధర, కంపెనీ ఫైనాన్షియల్స్ వివరాలు ఇవే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి