డబ్బు అవసరం ఎవరికి ఉండదు చెప్పండి..! కొన్నిసార్లు అత్యవసరంగా నగదు కావాలంటే దొరకదు. అలాంటప్పుడు క్రెడిట్ కార్డులపై రుణం తీసుకోవడం ఒక ఆప్షన్. త్వరగా డబ్బు చేతికి అందుతుంది. ఇది పర్సనల్ లోన్‌లాగే ఉంటుంది. పైగా తనఖాగా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే క్రెడిట్ కార్డులపై లోన్ తీసుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
* మీ క్రెడిట్ కార్డు బిల్లులను క్రమం తప్పకుండా సకాలంలో చెల్లించండి. అలాంటప్పుడే తర్వాత రుణాలను సులభంగా పొందొచ్చు.
* ఎప్పుడూ డీఫాల్ట్ అవ్వకండి. క్రెడిట్ కార్డు రుణం చెల్లింపులో జాప్యం ఏర్పడితే డీఫాల్టర్‌గా పరిగణిస్తారు. ఒక్కసారి ఆలస్యంగా చెల్లించినా క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
* ఇతర రుణాల మాదిరిగానే క్రెడిట్ కార్డు రుణాలపైనా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. మీరు తీసుకొనే రుణాన్ని బట్టి ఫీజు ఉంటుంది. సాధారణంగా ఇలాంటి అప్పులపై 1 నుంచి 5 శాతం వరకు ఫీజు ఉంటుంది.
* చాలా వరకు 60 నెలల వరకు రుణం తిరిగి చెల్లించేందుకు కాల పరిమితి ఇస్తారు. వ్యక్తిగత అవసరాలను బట్టి 12 నెలల నుంచి కాలపరిమితి ఎంచుకోవచ్చు.
* కావాలనుకుంటే ముందే అప్పు తీర్చేయొచ్చు. అయితే ప్రీ క్లోజర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
* రుణ పరిమితినీ కస్టమర్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ లిమిట్ దాటిపోయిందంటే ఛార్జీల మోత మోగుతుంది. ఉదాహరణకు మీ కార్డు లిమిట్ రూ.లక్ష అనుకుందాం. రూ.70వేలు రుణం తీసుకున్నారు. ఆ తర్వాత మీ క్రెడిట్ కార్డుపై రూ.30వేల వరకే లిమిట్ ఉంటుంది. ఒక్క పైసా దాటినా భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాలి.
* మీ క్రెడిట్ కార్డు బిల్లూ, క్రెడిట్ కార్డు లోను.. రెండింటి ప్రభావం క్రెడిట్ స్కోరుపై ఉంటుంది. అందుకే సకాలంలో బిల్లులు చెల్లించాలి.
* ఛార్జీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డు లోన్, టాపప్ లోన్లు తీసుకొనే ముందు నిబంధనలు మొత్తం చదవాలి.
* వాస్తవంగా క్రెడిట్ కార్డుపై రుణం తీసుకోకపోవడమే మంచిది! ఎందుకంటే వడ్డీరేట్లు 14 నుంచి 20శాతం మధ్యన ఉంటాయి. మిగతా ఆప్షన్లు చూశాకే ఇటువైపు రావాలి.
Also Read: Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి