దేశంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల ఈ-టెయిలర్‌ 'నైకా' ఐపీవో మొదలైంది. ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రూ.1085-1125 ధర మధ్యలో ఇష్యూ ఆఫర్‌ చేస్తున్నారు. నవంబర్‌ ఒకటి చివరి తేదీ. 


ఐపీవో విలువ


నైకా రూ.5352 కోట్ల విలువతో ఐపీవోకు వస్తోంది. మొత్తం 630 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది. ఇక ఆఫర్‌ ఫల్‌ సేల్‌ ద్వారా 41,972,660 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ చేస్తోంది. కాగా గ్రే మార్కెట్లో నైకా షేర్లు రూ.625 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. నవంబర్‌ 11న కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో నమోదవుతాయి.


కంపెనీ వివరాలు


నైకా, నైకా ఫ్యాషన్‌ యజమాని ఎఫ్‌ఎస్‌ఎన్ ఈ-కామర్స్‌ వెంచర్స్‌.  ఆన్‌లైన్‌ మార్కెట్లో నైకా ఫ్యాషన్‌, బ్యూటీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది. ఐపీవోకు ముందే కంపెనీ 174 మంది యాంకర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.2396 కోట్లు సమీకరించింది.


ఈ కంపెనీని 2012లో మాజీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ ఫాల్గుని నాయర్‌ స్థాపించారు. 2021, ఆగస్టు 31 వరకు 55.8 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 2014లో మొదటి స్టోర్‌ను ఆరంభించగా ఆగస్టు నాటికి దేశ విదేశాల్లోని 40 నగరాల్లో 80 స్టోర్లకు విస్తరించారు. బ్యూటీ, పర్సనల్‌ కేర్‌, ఫ్యాషన్‌ ప్రొడక్టులను నైకా ఉత్పత్తి చేస్తోంది. నైకా పేరుతో బ్యూటీ, పర్సనల్‌, నైకా ఫ్యాషన్‌ పేరుతో దుస్తులు, యాక్ససరీస్‌ను విక్రయిస్తోంది. ఇప్పటి వరకు 4,078 స్టాకిస్టుల ద్వారా 3.1 మిలియన్ల ఉత్పత్తులను ఆఫర్‌ చేసింది.


ఆర్థిక విలువ ఏంటి?


ఆన్‌లైన్‌ మార్కెట్లో నైకాకు మంచి పేరుంది. 2021లో ఈ కంపెనీ రూ.62 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాది రూ.16 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. 2021 ఆర్థిక ఏడాదిలో మొత్తం ఆదాయం 38 శాతం పెరిగి రూ.2441 కోట్లకు పెరిగింది. థర్డ్‌ పార్టీ మ్యానుఫ్యాక్చర్స్ ద్వారా ఉత్పత్తులను తయారు చేయించి విక్రయిస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే నైకా షేరు ప్రీమియం ఎక్కువే అనిపిస్తున్నా ఆనంద్ రాఠి సెక్యూరిటీస్‌, ఎలారా క్యాపిటల్స్‌, హెమ్ సెక్యూరిటీస్‌, కేఆర్‌ చోక్సీ, మోతీతాల్‌ ఓస్వాల్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌, రెలిగేర్‌ సెక్యూరిటీ ఈ ఐపీఎవోపై బుల్లిష్‌గా ఉన్నాయి.


Also Read: Diwali Gift: దీపావళికి బహుమతి పొందారా.. ఆఫీస్‌లో బోనస్ ఇచ్చారా.. మరి పన్ను కట్టాలని తెలుసా?


Also Read: Low Home loan interest: పోతే దొరకని ఆఫర్‌! అతి తక్కువ వడ్డీరేటుకే ఈ బ్యాంకులో హోమ్‌లోన్‌.. వివరాలు ఇవే!


Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!


Also Read: Pradhan Mantri Garib Kalyan Package: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి