సురక్షితం కావడం ప్రభుత్వం గ్యారంటీగా ఉండటంతో ఎక్కువ మంది ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు దాచుకొనేందుకు ఇష్టపడతారు. బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్న తరుణంలో భవిష్య నిధిపై ఎక్కువ రాబడి వస్తోంది. వేర్వేరు పీఎఫ్‌లపై 7.1 నుంచి 8.5 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) అని మొత్తం నాలుగు రకాల భవిష్య నిధి ఖాతాలు ఉన్నాయి.
పీపీఎఫ్ (PPF)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ఉద్యోగంతో సంబంధం లేకుండా ఎవరైనా తెరవొచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నారు. ఏడాదిలో పీపీఎఫ్ ఖాతాలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేసుకోవచ్చు. పీపీఎఫ్ 'ఈఈఈ' కేటగిరీలోకి వస్తుంది. అంటే వడ్డీ సహా జమచేసే మొత్తంపై ఎలాంటి ఆదాయ పన్ను వర్తించదు. పీపీఎఫ్ లాకిన్ పిరియడ్ 15 ఏళ్లు. అవసరం అనుకుంటే మరికొంత గడువు పెంచుకోవచ్చు.
ఈపీఎఫ్ (EPF)
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా తెరిచేందుకు ఉద్యోగులు మాత్రమే అర్హులు. సంఘటిత, అసంఘటిత రంగంతో సంబంధం లేదు. ప్రతి నెలా ఉద్యోగి తన మూల వేతనంలో 12 శాతం జమ చేయాలి. దీనికి తోడుగా యజమాని కూడా మరో 12 శాతం జమ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని సేవింగ్స్ ఖాతాలతో పోలిస్తే ఈపీఎఫ్‌పైనే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు. ఉద్యోగానికి వీడ్కోలు పలికాక ఈ ఖాతా మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత వచ్చే డబ్బుపై పన్నులేమీ ఉండవు.
వీపీఎఫ్ (VPF)
ఈపీఎఫ్‌కు అదనంగా మరికొంత డబ్బు దాచుకోవాలంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. ఉద్యోగులకు మాత్రమే ఇందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో దాచుకుంటున్న 12 శాతానికి అదనంగా మూలవేతనంలో ఎంతైనా చేసుకోవచ్చు. వడ్డీ రేటూ ఈపీఎఫ్‌కు ఉన్నట్టే ఉంటుంది. అంటే ప్రస్తుతం 8.5 శాతం అన్నమాట. వీపీఎఫ్‌ను ఒకసారి ఎంచుకుంటే కనీసం ఐదేళ్ల వరకు కొనసాగించాలి. మధ్యలో తీసేయడానికి వీల్లేదు.
జీపీఎఫ్ (GPF)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు దాచుకోవచ్చు. మూల వేతనం నుంచి 12శాతం ఈపీఎఫ్ జమ చేసిన తర్వాత అదనంగా దాచుకోవాలంటే జీపీఎఫ్ తెరవొచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ అందరికీ ఇది వర్తించదు. కొన్ని పరిమితులు వర్తిస్తాయి. ఇక నిబంధనలు, సౌకర్యాలు అన్నీ ఈపీఎఫ్ తరహాలోనే ఉంటాయి.
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!