టెక్‌ ప్రియులు, యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రైమరీ డివైజ్‌ ఆన్‌లైన్‌లో లేనప్పటికీ, ఇంటర్నెట్‌ అందుబాటులో లేకున్నా సెకండరీ డివైజ్‌లో మెసేజింగ్‌ యాప్‌ను వాడుకోవచ్చు. కొన్ని నెలలుగా ఈ ఫీచర్‌ను మెటా టెస్టు చేసింది. చాన్నాళ్లుగా ఇలాంటి ఆప్షన్‌ కావాలని యూజర్లు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


గతంలో వాట్సాప్‌ను సెకండరీ డివైజ్‌లో ఉపయోగించాలంటే కొన్ని ఇబ్బందులు ఉండేవి. ప్రైమరీ డివైజ్‌ కచ్చితంగా ఆన్‌లైన్‌లోనే ఉండాల్సి వచ్చేది. ఇంటర్నెట్‌ తప్పనిసరి అయ్యేది. ఇప్పుడు అలాంటి వాటిని  మెటా పరిష్కరించింది. ఫోన్‌ ఉపయోగించి ఒకసారి లాగిన్‌ అయితే చాలు! ప్రైమరీ డివైజ్‌ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. రెండు డివైజుల్లోనూ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వెర్షన్లలో మల్టీ డివైజ్‌ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఇకపై వెబ్‌ వెర్షన్‌ వాడుతుంటే ఫోన్‌కు ఇంటర్నెట్‌ లేకున్నా ఫర్వాలేదు.


ఈ ఫీచర్‌ ఇప్పటికీ బీటా దశలోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. వాట్సాప్‌లోని లింక్‌డ్‌ డివైజ్ సెట్టింగ్స్‌లో బీటా ఆప్షన్‌ను యూజర్లు సెలక్టు చేసుకోవాలి. ఎనేబుల్‌ అయిన వెంటనే గతంలో లింకైన డివైజుల నుంచి ఆటోమేటిక్‌గా అన్‌లింక్‌ అవుతుంది. ఇకపై ఉపయోగించాల్సిన డివైజ్‌ను కొత్తగా లింక్‌ చేసుకుంటే చాలు. ఒకసారి లింకైతే  గతంలో మాదిరిగానే సులభంగా ఉపయోగించుకోవచ్చు.


స్మార్ట్‌ఫోన్‌ లేదా ప్రైమరీ డివైజ్‌ ఆఫ్‌లైన్‌ వెళ్లిన 14 రోజుల వరకు సెకండరీ డివైజ్‌లో సందేశాలు పంపించొచ్చు. పొందొచ్చు. ఫోన్‌ పోయినా, అందుబాటులో లేకున్నా, బ్యాటరీ తక్కువగా ఉన్నా వాట్సాప్‌ వెబ్‌ పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఐఓఎస్‌లో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. లింకైన డివైజ్‌ నుంచి సందేశాలు తొలగించేందుకు అనుమతి లేదు. ట్యాబ్లెట్‌ లేదా సెకండరీ స్మార్ట్‌ఫోన్‌తో లింక్‌ చేయలేరు. వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ ఫీచర్‌ పొందేందుకు యూజర్లు తమ యాప్‌ను లేటెస్టు వెర్షన్‌తో అప్‌డేట్‌ చేయాలి.


Also Read: Whatsapp New Feature: ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’కు మార్పులు.. ఇలా అయితే సూపరే!


Also Read: Honor X30 Max: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: Provident Funds: ప్రావిడెంట్‌ ఫండ్స్‌ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?


Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్‌ తెచ్చిన ఐటీ శాఖ


Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి