Travel Loan For Summer Holiday Trip: ఏప్రిల్ నెలాఖరు నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. సమ్మర్ హాలిడేస్‌లో చుట్టాల ఇళ్లకు వెళ్లేవాళ్లు కొందరయితే, కొత్త ప్రదేశాలను సందర్శించేవాళ్లు మరికొందరు. దూర ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్లాలంటే బోలెడు ఖర్చవుతుంది. ఆ ఖర్చులకు జడిసి చాలా మంది తమ కోర్కెలను మనస్సులోనే తొక్కి పెడతారు. అయితే, "ప్రయాణం కోసం పర్సనల్ లోన్" (Personal Loan For Travel) ఉపయోగపడేది ఇక్కడే. ఇది, మీ పొదుపును కదిలించకుండానే మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి సాయపడుతుంది.
'ప్రయాణం కోసం పర్సనల్ లోన్' ఎలా పని చేస్తుంది? దీనిని ట్రావెల్ లోన్ అని కూడా పిలుస్తారు. ఈ లోన్ మిమ్మల్ని ఏదైనా సముద్ర తీరానికో, కొండ ప్రాంతానికో, సాహస యాత్రకో తీసుకువెళ్లి ఈ వేసవి సెలవులను సుమధుర అనుభవాలుగా మారుస్తుంది. ప్రయాణ ఖర్చుల కోసం తీసుకునే పర్సనల్ లోన్ మీ సెలవులకు సంబంధించిన అన్ని వ్యయాలను భరించగలదు. ఇందులో మీ విమాన ప్రయాణం/ దూర ప్రయాణం, వీసా, వసతి, షాపింగ్ లేదా సందర్శన ఖర్చులన్నీ కవర్ అవుతాయి. ట్రావెల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆమోదం కూడా త్వరగా లభిస్తుంది & మీకు అనుకూలమైన EMIల ద్వారా రుణం తీర్చవచ్చు. ముందస్తుగా ప్లాన్ చేసిన సెలవుల నుంచి చివరి నిమిషంలో ప్లాన్ చేసే విహారయాత్ర వరకు ప్రతి సందర్భానికి ఈ ఆప్షన్ పని కొస్తుంది.
ట్రావెల్ లోన్ ద్వారా ఎంత రుణం తీసుకోవచ్చు?రుణ మొత్తం బ్యాంక్‌ను బట్టి మారుతుంది, అర్హతలను బట్టి రూ. 50 లక్షల వరకు లోన్ లభిస్తుంది. దరఖాస్తు ఆమోదం పొందిన 24 గంటల్లోపు రుణం చేతికి వస్తుంది. ఇది పర్సనల్ లోన్ కాబట్టి దీనికి ఎటువంటి పూచీకత్తు అవసరం లేదు. తీసుకున్న రుణాన్ని 12 నుంచి 96 నెలల కాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.
ట్రావెల్ లోన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?ట్రావెల్ లోన్‌ను ఎందుకు తీసుకోవాలి, పొదుపు చేసుకున్న డబ్బుతో సెలవులను ఎంజాయ్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మీ పొదుపు నుంచి ఖర్చు చేయడం తేలికే. కానీ అది మీ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రయాణానికి వ్యక్తిగత రుణం తీసుకోవడం వల్ల మీ అత్యవసర నిధి లేదా దీర్ఘకాలిక పెట్టుబడులను కాపాడుకోవచ్చు. తద్వారా, మీ ఆర్థిక పరిస్థితిపై మీకు పూర్తి నియంత్రణ ఉంటుంది. పైగా.. మీకు అవసరమైన వెంటనే ట్రావెల్ లోన్ లభిస్తుంది, సులభమైన EMIలలో తిరిగి చెల్లించవచ్చు. పేపర్ వర్క్ లేకుండా పూర్తిగా ఆన్‌లైన్‌లో పని పూర్తవుతుంది.
పర్సనల్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే అంశాలు:లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు, వడ్డీ రేటును ప్రభావితం చేసే అన్ని అంశాల గురించి తెలుసుకోవాలి. క్రెడిట్ స్కోరు: మీ క్రెడిట్ స్కోరు 685 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, కనిష్ట వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం పొందే అవకాశం ఉంది.రుణ మొత్తం & కాలపరిమితి: రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితి కూడా మీ వడ్డీ రేటును నిర్ణయించవచ్చు.ఇప్పటికే లోన్ ఉంటే: కొనసాగుతున్న EMI ఎంత తక్కువగా ఉంటే, ట్రావెల్ లోన్ పొందడం అంత సులభం అవుతుంది.
హాలిడే ట్రిప్ మీ మనసును రిఫ్రెష్ చేస్తుంది, మీ శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. కొత్త దృక్పథాన్ని & జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలను అందిస్తుంది. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితి మీకు అడ్డురాకుండా, తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం తీసుకుని మీ కలల ప్రయాణాన్ని నిజం చేసుకోండి.