2017లో వాట్సాప్.. ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారులు ఏదైనా మెసేజ్ పంపిస్తే దాన్ని డిలీట్ చేసే అవకాశాన్ని ఈ ఫీచర్ అందించింది. ఆ తర్వాత దాన్ని గంటా 8 నిమిషాలకు పెంచారు. త్వరలో దీన్ని మళ్లీ పెంచే అవకాశం ఉంది.


వాట్సాప్ ఆండ్రాయిడ్ కొత్త బీటా వెర్షన్ 2.21.23.1లో ఈ టైమ్ లిమిట్ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన అప్‌డేట్ కనిపించింది. అయితే ఇది ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అప్‌డేట్‌లో వినియోగదారులు మెసేజ్ పంపాక ఎప్పుడైనా మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చన్న మాట. మెసేజ్ పంపిన మూడు నెలల తర్వాత దాన్ని డిలీట్ చేయవచ్చు.


అయితే ఇది ఇంకా డెవలప్‌మెంట్‌లోనే ఉంది కాబట్టి ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తుందా లేక స్క్రాప్ చేస్తుందా అని తెలియాల్సి ఉంది. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


అయితే ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా వాట్సాప్ ఇస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయ్యే ఫోన్లు, పిక్సెల్ ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.


దీని ద్వారా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు చాట్‌లను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ టీంతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ తెలిపింది. దీంతో మీరు ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు, ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు మార్చుకోవడం కూడా చాలా సులభం అవుతుంది.


ఇటీవలే వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా లావాదేవీలు చేస్తే రూ.51 క్యాష్‌బ్యాంక్‌ అందిస్తామని ప్రకటించింది. ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఎంపిక చేసిన కస్టమర్లు, ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే వర్తించనుంది. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.21.20.3 వాడుతున్న యూజర్లకు ఈ ఆఫర్‌ ప్రమోట్‌ చేస్తే బ్యానర్‌ కనిపిస్తోంది. 'నగదు పంపండి.. రూ.51 క్యాష్‌బ్యాక్‌ పొందండి' అంటూ బ్యానర్‌ ఫ్లాష్‌ అవుతోంది.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి