బ్రైట్‌కామ్ గ్రూప్ (Brightcom Group) స్టాక్ మదుపర్లకు లాభాల పంట పండించింది. ఏడాదిలోనే 1705 శాతం రాణించింది. బీఎస్‌ఈలో 2020, నవంబర్ 4న రూ.4.18 ఉన్న ఈ షేరు 2021, నవంబర్ 4న రూ.75.40 వద్ద ముగిసింది. అంటే ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.18.03 లక్షలు చేతికి అందేవి. ఇదే సమయంలో సెన్సెక్స్ 47.89 శాతమే రాణించడం గమనార్హం.
ఈ ఏడాది అక్టోబర్ 13న ఈ షేరు రూ.90.55 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో షేర్ల ధర కరెక్షన్‌కు గురైంది. దీపావళి ముహురత్ ట్రేడింగ్ సెషన్‌లో 2.78 లక్షల షేర్లు చేతులు మారాయి. వీటి విలువ రూ.2.10 కోట్లుగా ఉంది. ఇక ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ మార్కెట్ విలువ రూ.7,853 కోట్లుగా ఉంది.
బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు ఈ ఏడాది ఆరంభం నుంచి 1002 శాతం పెరిగాయి. ఒక్క నెలలోనే 17 శాతం ర్యాలీ చేశాయి. ప్రస్తుతం బ్రైట్‌కామ్ షేరు 5, 20, 50, 100, 200 రోజుల మూవింగ్ యావరేజెస్ కన్నా ఎక్కువగానే ఉంది. ఈ కంపెనీ ఏఎస్‌ఎం పరిధిలో ఉండటంతో మదుపర్ల పెట్టుబడులకు రక్షణ ఉంటుంది. షేరు ధర ఐదు శాతం మించి పడిపోదు. కంపెనీలో ప్రమోటర్లకు 22.40 శాతం, పబ్లిక్ షేర్ హోల్డర్లకు 77.60 శాతం వాటా ఉంది.
Also Read: Provident Funds: ప్రావిడెంట్ ఫండ్స్ ఎన్ని రకాలు? ఎందులో దాచుకుంటే ఎంత డబ్బొస్తుందో తెలుసా?
Also Read: Income Tax Update: మీరు పన్ను చెల్లింపుదారులా? కొత్త స్టేట్‌మెంట్ తెచ్చిన ఐటీ శాఖ
Also Read: Buying First House Tips: మొదటిసారి ఇల్లు కొంటున్నారా..! ఈ తప్పులు చేయకండి
Also Read: Whatsapp New Feature: ఇంటర్ నెట్ అవసరం లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు.. అద్భుతమైన నయా ఫీచర్