ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి మరెప్పుడూ చూడలేదేమో! సోషల్‌ మీడియాలో ఇంత బజ్‌ ఎప్పుడూ రాలేదేమో!! అఫ్గాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ నేపథ్యమే ఇందుకు కారణం. ఎందుకంటే భారత అభిమానులు ఏకంగా తమ పేర్లనే మార్చేసుకుంటున్నారు తెలుసా? పైగా విచిత్రమైన మీమ్స్‌ అలరిస్తున్నాయి.


నేడు జరిగే మ్యాచుల్లో అఫ్గాన్‌ గెలవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆ జట్టుకు మద్దతు ఇస్తున్నారు. సోషల్‌ మీడియాలో తమ పేర్ల పక్కన అఫ్గాన్‌ ఆటగాళ్ల పేర్లను పెట్టుకుంటున్నారు. కొందరైతే అఫ్గాన్‌ జాతీయ జెండాను పెట్టుకున్నారు.


అభిమానులు పెట్టుకుంటున్న పేర్లు కూడా బాగుంటున్నాయి. నవ్వు తెప్పిస్తున్నాయి. సాగర్‌కస్మ్‌ అనే వ్యక్తి అస్ఘర్‌ అఫ్గాన్‌ అని, నిషాన్‌.. 'నిసాన్‌ ఉర్‌ రెహ్మాన్‌', రోహిత్‌ జంగ్రా.. 'రోహితుల్లా జజాయ్‌'గా పేర్లు మార్చేసుకున్నారు. అఫ్గాన్‌ జట్టులో రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, హజ్రతుల్లా జజాయ్‌, నజీబుల్లా జర్దాన్‌, మహ్మద్‌ నబీ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందేగా.


భారతీయులు తమ పేర్లను మార్చుకొనేందుకు, అఫ్గాన్‌కు మద్దతిచ్చేందుకు కారణం ఉంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌, భారత్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మూడూ సెమీస్‌ బెర్త్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. టీమ్‌ఇండియా, అఫ్గాన్‌ నాలుగు మ్యాచులాడి రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. కివీస్‌ నాలుగింట్లో మూడు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు తలపడే మ్యాచులో అఫ్గాన్‌పై విజయం సాధిస్తే కివీస్‌ నేరుగా సెమీస్‌ వెళ్లిపోతుంది. కానీ పఠాన్లు వారిని ఓడిస్తే భారత్‌కు సెమీస్‌ అవకాశాలు నిలిచే ఉంటాయి. ఆఖరి మ్యాచులో నమీబియాను భారీ తేడాతో  ఓడిస్తే మెరుగైన రన్‌రేట్‌తో నాకౌట్‌కు వెళ్లొచ్చు. అందుకే భారతీయులకు ఇంత ఆసక్తి.






Also Read: ENG vs SA, Match Highlights: ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్.. విజయం ప్రొటీస్‌కి.. సెమీస్ బెర్త్ ఆసీస్‌కి!


Also Read: WI vs AUS Match highlights: కేక పెట్టించిన వార్నర్‌ భయ్యా..! 16.2 ఓవర్లకే 158 టార్గెట్‌ కొట్టేసిన ఆసీస్‌


Also Read: Athiya Shetty and KL Rahul: కేఎల్‌ రాహుల్‌ ప్రేయసి ఆమే..! టీమ్‌ఇండియాలో మరో ప్రేమకథ..! బాలీవుడ్‌ నటితో రాహుల్‌ ప్రేమాయణం!


Also Read: T20 World Cup: మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు..! ఆసీస్‌, టీమ్‌ఇండియా ప్రాణాలు మరో రెండు జట్ల భుజాలపై! పేలిన వసీమ్‌ జాఫర్‌ మీమ్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి