India Corona Updates: దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారిని దాదాపు కట్టడి చేయడంతో దాదాపు విజయాన్ని సాధించాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,853 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటి కేసులతో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో 526 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. కరోనా మరణాలు నిన్నటి కంటే 25 శాతం అధికంగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.
జనవరిలో వ్యాక్సినేషన్ పంపిణీ మొదలైనప్పటి నుంచి నేటి ఉదయం వరకు 1,08,21,66,365 (108 కోట్ల 21 లక్షల 66 వేల 365) డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. నిన్న 12,432 మంది కరోనాను జయించగా.. మొత్తం రికవరీలు 3.37 కోట్లు దాటాయి. భారత్‌లో ప్రస్తుతం 1,44,845 (ఒక లక్షా 44 వేల 845) యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 260 రోజులలో ఇవే అతి తక్కువ క్రియాశీల కేసులు. మరోవైపు నిన్న ఒక్కరోజులో 9,19,996 (9 లక్షల 19 వేల 996) శాంపిల్స్ పరీక్షించగా.. దాదాపు 11 వేల మందికి కొవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తాజా హెల్త్ బులెటిన్‌లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధికారులు వెల్లడించారు.
Also Read: ఈ లక్షణాలను తేలికగా తీసుకోవద్దు... గుండెపోటుకు ముందస్తు హెచ్చరికలివి
నిన్న 28,40,174 మందికి టీకాలు అందించారు. దీంతో దేశంలో మొత్తం టీకా డోసుల పంపిణీ సంఖ్య 1.08 కోట్లు దాటింది. దేశంలో ఇప్పటివరకూ 4,60,791 మంది కొవిడ్ బారిన పడి చనిపోయారు. మరోవైపు రికవరీ రేటు 98.24 శాతానికి మెరుగవటం భారీ ఊరటనిస్తోంది. దేశంలో 0.43 శాతం యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు