దసరా, దీపావళి పండుగల సీజన్లో ప్రజలు మామూలుగా ఖర్చు పెట్టలేదు! లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఇందుకోసం క్రెడిట్‌ కార్డులను విపరీతంగా గీకేశారు! సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్‌ నెలలో క్రెడిట్‌ కార్డులపై ఖర్చు చేయడం 50 శాతం పెరిగింది. నవంబర్‌ తొలి వారంలోనూ ఈ జోరు కనిపించింది.


సెప్టెంబర్‌ నెలలోనే క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.80వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ లెక్కన అక్టోబర్‌, నవంబర్లో క్రెడిట్‌ కార్డుల వినియోగం రికార్డు స్థాయిలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI) సమాచారం ప్రకారం క్రెడిట్‌ కార్డులపై ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.1 లక్షల కోట్లుగా ఉంది. మార్చిలో నమోదైన రూ.72,300 కోట్ల రికార్డు సెప్టెంబర్లో బద్దలైన సంగతి తెలిసిందే.


ఇక సెప్టెంబర్‌ మాసంలో కొత్త క్రెడిట్‌ కార్డుల జారీ పెరిగింది. కొత్తగా పది లక్షల పదివేల క్రెడిట్‌ కార్డులు బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చేరాయి. జులైలోని 6.5 లక్షల రికార్డును బద్దలు కొట్టాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2,44,000, ఐసీఐసీఐ బ్యాంకు 2,34,000, యాక్సిస్‌ బ్యాంక్‌ 2,00,00, ఎస్‌బీఐ 1,75,000 కొత్త కార్డులు మంజూరు చేశాయి.


క్రెడిట్‌ కార్డు స్పెండింగ్‌లో కొటక్ మహీంద్రా బ్యాంక్‌ అత్యధిక వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్లో 27 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఐసీఐసీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 13 శాతం వృద్ధితో తర్వాతి స్థానంలో నిలిచాయి. స్పెండింగ్‌ 50 శాతం, వార్షిక ప్రాతిపదికన 75 శాతాన్ని మించి వృద్ధి నమోదైందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. పండగ ఆఫర్లతో స్పెండింగ్‌ కొవిడ్‌ ముందునాటి స్థాయికి చేరుకుందని వెల్లడించింది. ఇక క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల స్పెండింగ్‌ నిష్పత్తి 1.28 రెట్లుగా ఉందని ఐసీఐసీఐ వెల్లడించింది.


Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!


Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!


Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌


Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు


Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి