మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని, భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మంచి ఆహారం తినాలి. అయితే ఇప్పుడు అంతా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఆహారం ఎక్కువైపోయింది. అలాగే ఆయిల్ ప్యాకెట్ల నుంచి, జ్యూసుల వరకు రకరకాల ఆహారం సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అవి కొనేముందు ఆ ప్యాకెట్ లేబుళ్లపై ఆ పదార్థం తాలూకు వివరాలు ఉంటాయి. అవి చదివాకే వాటిని కొనడం ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. అయితే వాటిపై కింద చెప్పిన విధంగా రాసి ఉంటే మాత్రం కాస్త ఆలోచించి కొనండి. వాళ్లు రాసినవన్నీ నమ్మేసి కొనేయకండి. 


1. ఫ్యాట్ ఫ్రీ
కొవ్వు అనే పదం కనిపిస్తే చాలు ఆమడదూరం పారిపోతున్నారు చాలా మంది. ఫ్యాట్ ఫ్రీ అని రాసి ఉంటే చాలు ఆ ప్యాకెట్ ను కొనేసుకుంటారు. కానీ ఫ్యాటీ ఫ్రీ అని ఉందంటే అందులో కొవ్వుశాతం చాలా తక్కువని అర్థం, అంతవరకు నిజమే. కొవ్వు తీసేయడం వల్ల ఆ పదార్థం రుచిని కోల్పోతుంది. దానికి అదనపు రుచిని ఇచ్చేందుకు చక్కెరను, ఉప్పును ఎక్కువ జోడిస్తారు. కానీ ఈ విషయం ప్యాకెట్ లేబుళ్లపై రాసి ఉండదు. ఫ్యాట్ ఫ్రీ అని ఉందంటే, అందులో చక్కెర, ఉప్పు శాతం ఎక్కువ ఉంటుందని అర్థం. 


2. హై ఫ్రుక్టోజ్ కార్న్ సిరప్
మనం సాధారణంగా వాడే చక్కెరకు ప్రత్యామ్నాయంగా హై ఫ్రూక్టోజ్ కార్న్ సిరప్ ను వాడతారు. మనశరీరం దీన్ని జీర్ణింపచేసుకునే ప్రక్రియ కాస్త క్లిష్టతరంగా ఉంటుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇది మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీన్ని ఎక్కువగా రెడీ టు ఈట్ బ్రేక్ ఫాస్ట్‌లలో, సాస్‌లు, కూల్ డ్రింకులలో వాడతారు. 


3. కొలెస్ట్రాల్ ఫ్రీ
వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువ మంది వ్యాపారుల మార్కెటింగ్ వ్యూహం ‘కొలెస్ట్రాల్ ఫ్రీ’ అని రాయడం. నిజానికి కొలెస్ట్రాల్ కేవలం జంతు ఉత్పత్తుల్లో మాత్రమే కనిపిస్తుంది.  అంటే పాలు, పెరుగు లాంటి వాటిలో ఉంటుంది. కానీ వ్యాపారులు పప్పులు, ఉప్పులపై కూడా కొలెస్ట్రాల్ ఫ్రీ రాసి అమ్మేస్తున్నారు. నిజానికి వాటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు.


4. షుగర్ ఫ్రీ ఫుడ్స్
షుగర్ ఫ్రీ ఫుడ్స్ అని రాస్తున్న ప్యాకెట్లను వెంటనే కొనేస్తుంటారు కొంతమంది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే షుగర్ కు బదులు అందులో ఆల్కహాల్ ను వినియోగిస్తారు. షుగర్ ఉన్న ఆల్కహాల్ తీపిరుచిని అందిస్తాయి కానీ శరీరం దాన్ని శోషించుకోలేక ఇబ్బంది పడుతుంది. దీనివల్ల డయేరియా బారిన పడే అవకాశం ఉంది. 


Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?


Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు



Also read: చలికాలంలో వేడి పుట్టించే నువ్వులు తినడం అవసరమే


Also read: ఈ అలవాట్లు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి